Radhe Shyam Trailer : ప్రభాస్ -పూజాహెగ్డే జంటగా నటించిన ప్యాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ ట్రైలర్ గురువారం, డిసెంబర్ 23, 2021 నాడు రిలీజ్ కానుంది. ఈ మూవీకి రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ మూవీపై క్రేజ్ ను భారీగా పెంచేశాయి. జనవరి 14న రాధేశ్యామ్ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ప్రభాస్ జ్యోతిష్కుడిగా కనిపించబోతున్నాడు. ఓ ఇంటెన్స్ లవ్ స్టోరీని రాధేశ్యామ్ లో చూపించబోతున్నామని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చెప్పారు. ఇటలీకి.. ఇండియాలో కథకు ఏంటి సంబంధం అనేది సినిమా చూసి తెల్సుకోవాలి. మూవీకి సౌత్ లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు.

(Visited 70 times, 1 visits today)