ప్రభాస్ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి…. బడ్జెట్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

Prabhas21 Nag Ashwin
Spread the love

యంగ్ రెబల్ స్టార్, ఇండియా సినిమా బాహుబలి ప్రభాస్ 21వ సినిమా కోసం భారీ కసరత్తు జరుగుతోంది. #Prabhas21 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ .. ప్రభాస్ కోసం.. సైంటిఫిక్ – ఫిక్షన్ కథను సిద్ధం చేశాడట. Sci-Fi మూవీని అల్ట్రా బడ్జెట్ తో రూపొందించనున్నారు.

అశ్వనీదత్ .. ప్రభాస్ – నాగ్ అశ్విన్ మూవీకి నిర్మాత. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతగా పేరుతున్న అశ్వనీదత్.. ఈసారి దేశం మొత్తం నోరు వెళ్లబెట్టేలా అత్యంత భారీ బడ్జెట్ మూవీ తీస్తున్నారు. గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్సులకు అవకాశం ఉన్న ప్రభాస్ 21 సినిమాను 400 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్నారట.

ప్రభాస్ 21 సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. లాక్ డౌన్ ఎలా ఉంది కాబ్టి..  ప్రి ప్రొడక్షన్ పనులకు ప్రిపరేషన్స్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ డిఫరెంట్ సినిమాలు, భావోద్వేగం ఉన్న సినిమాలు తీయడంలో దిట్ట. సో.. ప్రభాస్ కోసం 4వందల కోట్ల బడ్జెట్ తో తీయబోయే సినిమాకు సంబంధించిన ప్రతి అప్ డేట్ కూడా ఆసక్తికరమైనదే. ఏమంటారు..?

(Visited 111 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *