చెప్పాడు.. చేస్తున్నాడు.. లడఖ్ లో లడాయికి మోడీ రెడీ!

PM MOdi In Galwan Valley
Spread the love

డేరింగ్ మోడీ

లడఖ్ లో సర్ ప్రైజ్ టూర్

ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ డేర్ చేశారు. చైనాతో ఉద్రిక్తతల కన్నా.. క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉండే లడఖ్ లోని చైనా సరిహద్దులో పర్యటిస్తున్నారు.

గాల్వాన్ లోయలో ఇటీవలే చైనా సైనికులతో భారత ఆర్మీ ఘర్షణ పడింది. ఈ ఫైట్ లో 21మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనావైపు కూడా ప్రాణనష్టం ఉన్నట్టు ఆ దేశం తెలిపింది. ఆ తర్వాత.. సరిహద్దు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ విషయంలో రెండు దేశాలు చర్చలు జరిపాయి. ప్రస్తుతం ఘర్షణ లేకున్నా.. రెండు దేశాల బలగాలు మాత్రం LAC వెంబడి మోహరించాయి. యుద్ధ విమానాలు తిరుగుతున్నాయి. గస్తీ పెరిగింది. ఓవరాల్ గా.. ఓ టెన్షన్ పరిస్థితి మాత్రం ఈస్టర్న్ లడఖ్ లో కనిపిస్తోంది.

ఈ సిట్యుయేషన్ లో ప్రధాని మోడీ లడఖ్ కు బయల్దేరి వెళ్లారు. వాస్తవానికి గురువారం నాడు వచ్చిన ప్రకటన వేరు. సీడీఎస్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవానేతో కలిసి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెళ్తాడని చెప్పారు. ఐతే.. నిన్న రాత్రి రాజ్ నాథ్ పర్యటన క్యాన్సిల్ అయినట్టు మీడియాకు సమాచారం అందింది. ఐతే… ఈ ఉదయం సడెన్ గా ప్రధాని లడఖ్ పర్యటనలో కనిపించారు. ఈ ఫొటోలు బయటకు రావడంతో… అందరూ షాకయ్యారు.

Image

ప్రధాని మూతికి మాస్క్ కట్టుకుని.. ప్రత్యేక హెలికాప్టర్ లో లేహ్ లో ల్యాండ్ అయ్యారు. లడఖ్ లోని నిము ప్రాంతంలో ఎయిర్ ఫోర్స్, ఆర్మీతో కొద్దిసేపు మాట్లాడారు. సముద్రమట్టానికి 11వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ప్రాంతం. సాధారణంగా ఇక్కడ శ్వాస సమస్యలు ఎదురవుతుంటాయి. ఇక్కడకు వెళ్లాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం. సైనికులకు ఇలాంటి శిక్షణ ఉంటుంది. ఇంతటి ఇబ్బందికర వాతావరణంలో ఉన్న ప్రాంతానికి వెళ్లిన ప్రధాని..  సైనికులు, అధికారులకు ఎటువంటి సూచనలు చేశారన్నది ఇపుడు ఆసక్తిగా మారింది.

దేశ సరిహద్దుకు వెళ్లడం అంటే మాటలు కాదు. ఏకంగా ప్రైమ్ మినిస్టర్ దిగివస్తే… సోల్జర్స్ లో వచ్చే కాన్ఫిడెన్స్ మామూలుగా ఉండదు. దేనికైనా సై అనే స్థాయికి వారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చేరిపోతాయి. అంటే.. ప్రధాని కూడా.. దేనికైనా సిద్ధం కావాలని సైనికులకు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. చైనాతో అవసరమైతే ఢీకొట్టేందుకు అవసరమైన యుద్ధ సన్నద్ధత చేసుకుంటోంది భారత్. ఇటీవలే రష్యాతో.. యుద్ధ విమానాలతో  ఓ డీల్ కుదుర్చుకుంది.

“సైనికుల త్యాగాలు వృధా పోవు ” అని మోడీ ఇప్పటికే చెప్పారు. ప్రధాని పర్యటన ఏ పరిణామాలకు దారితీస్తుందన్న ఆసక్తి అంతటా ఏర్పడింది. శుక్రవారం రోజంతా ప్రధాని లడఖ్ లో ఉంటారని తెలుస్తోంది.

(Visited 150 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *