పాకిస్థాన్ లోనూ తబ్లిగీ ప్రకంపనలు.. పెరుగుతున్న కేసులు

Pakistan Tablighi Jamaat
Spread the love

ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్లిన తబ్లిగీ జమాత్ వర్కర్ల కారణంగానే ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర చెబుతోంది. భారీస్థాయిలో జనాన్ని సమీకరించి.. జరిపిన సామూహిక సమావేశాల కారణంగానే.. కరోనా వైరస్ స్ప్రెడ్ అయిందని పరిశీలనలు చెబుతున్నాయి. ఇండియాలో తబ్లిగీ జమాత్ కు విదేశాలనుంచి హాజరైన వారిపై కేసులు నమోదవగా.. ఈ సంస్థ కార్యకలాపాలను కూడా బ్యాన్ చేశారు. ఇపుడు పాకిస్థాన్ లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.

పాకిస్థాన్ లో ఇప్పటికే దాదాపు 5వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 65 మంది వరకు చనిపోయారు. తబ్లిగీ జమాత్ వర్కర్ల కారణంగానే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. మార్చి 10వ తేదీన పంజాబ్ ప్రావిన్స్ లోని రాయ్ విండ్ మర్కజ్ లో.. తబ్లీగీ జమాత్ కార్యకర్తలు భారీస్థాయిలో వార్షిక సమావేశాలు నిర్వహించారు. దీనికి రెండున్నర లక్షల మంది వచ్చారని సంస్థ చెబుతున్నా… కనీసం లక్ష మంది హాజరైనట్టు పాక్ వర్గాలు అంటున్నాయి. 40 దేశాల నుంచి.. 3000 మంది ఫారినర్లు పంజాబ్ ప్రావిన్స్ లోని తబ్లీగీ కాంగ్రగేషన్ కు హాజరైనట్టు లెక్కలు చెబుతున్నాయి. రాయ్ విండ్ నగరంలోని మర్కజ్ లో పాల్గొన్నవారిలో.. పెద్దసంఖ్యలో కరోనాపాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండు లక్షల మంది జనాభా ఉన్న రాయ్ విండ్ పట్టణాన్ని పూర్తిగా లాక్ డౌన్ చేసింది పాక్ ప్రభుత్వం. పాకిస్థాన్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఈ నగరంలో ఎసెన్షియల్ సర్వీసెస్ అందిస్తున్నారు.

పంజాబ్ ప్రావిన్స్ లోనే.. దాదాపు 11 వేల మంది తబ్లిగీలను గుర్తించి క్వారంటైన్ చేసినట్టు పాక్ పత్రిక డాన్ చెబుతోంది. విదేశాలనుంచి తబ్లిగీ జమాత్ సమావేశాలకు హాజరైన వేలాది మంది ఫారినర్లు కూడా పాక్ లోనే ఉండిపోయారు. లాక్ డౌన్ కారణంగా.. పాక్ అన్ని ఫ్లైట్ సర్వీస్ లను బంద్ చేసింది. దీంతో.. ఫారినర్లు అందరూ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

(Visited 83 times, 1 visits today)
Author: kekanews