ఆన్ లైన్ చదువు ట్రాజెడీ.. స్మార్ట్ ఫోన్ లేక పేదింటి బాలిక ఆత్మహత్య

Kerala Minor Girl Suicide
Spread the love

ఆన్ లైన్ క్లాసులు వినడం లేదని అమ్మాయి ఆత్మహత్య

చదువులో వెనుకబడి పోతానేమో ననే భయంతో సూసైడ్

ఏనుగు సంఘటన పట్ల ఓవర్ రియాక్షన్ ల తో..కేరళ లొనే ఒక చిన్నారి ఆత్మహత్య వార్త ఎవరూ పట్టించుకోలేదు..ఆ పాప ఒక నిరుపేద దళిత బిడ్డ కావడమే కారణం.

ఇండియా ను భారత్ గా మార్చినా..దళితుల , నిరుపేద జీవితాల తలరాతలు మారుతాయా..

అర్బన్ భారత్.. రూరల్ భారత్ మధ్య ఎంత గ్యాప్ పెరిగిందో చెప్పడానికి ఈ అమ్మాయి ఆత్మహత్య ఉదాహరణ.. పదవ తరగతి అమ్మాయి ‘దేవిక’ ..ఎప్పుడు చదువులో ఫస్ట్..అందరూ ఆన్లైన్ క్లాసులు వింటుంటే చదువులో తాను వెనకబడిపోతానేమో అన్న బెంగతో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.

కేరళ లోని మనికేరి గ్రామంలో జరిగిన సంఘటన. తండ్రి బాలకృష్ణన్ దినసరి కూలీ.పాడైపోయిన టీవీ ను కూడా రిపేర్ చేయించలేని స్థితి. ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఆన్లైన్ క్లాసులు చెప్పాలని ఆర్డర్స్ రావడం తో ఉపాధ్యాయులు.. పిల్లలు సన్నద్ధమయ్యారు.స్మార్ట్ ఫోన్ లేని దేవిక తండ్రి ని అడిగింది.రోజూ తల్లి దగ్గర ఏడ్చింది…స్నేహితుల ఇళ్లకు తిరిగింది. Smart Phone  ఉన్న ప్రతీ ఒక్కరూ పాఠాలు వింటున్నారు…తాను క్లాసులు అటెండ్ కాలేకపోతున్నాను అని..ఫెయిల్ అయిపోతాను అన్న భయం తో దిగులు తో ప్రాణాలు తీసుకుంది..

” నేను వెళ్లిపోతున్నా ” అనే నోట్ పుస్తకంలో రాసి చనిపోయిన ఈ చిన్నారి మృతి కి కారకులు ఎవరు..

హడావిడిగా ఏదో చేసేస్తున్నాం అని చెప్పుకోడానికి రోజూ యు ట్యూబ్ లింకులూ…ఆన్లైన్ వీడియో లు.. జూమ్ ఆప్ లంటూ చేస్తున్న హడావిడి… ఇవన్నీ ఎంతమంది పిల్లలకు అందుబాటులో ఉంటాయి అన్న కనీస ఆలోచన ఉండొద్దా..

స్మార్ట్ ఫోన్లు..నెట్ కనెక్షన్ అందుబాటులో లేని పిల్లల మానసిక.. ఆర్థిక స్థితిగతుల గురించిన మినిమం అవగాహన లేకుండా ఇలాంటి ఆన్లైన్ అత్యుత్సాహం ఇంకెంతమంది పిల్లలను బలితీసుకోనుందో..

— Rajitha Kommu.

(Visited 86 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *