ఎన్టీఆర్ హీరోయిన్ కు ఓవర్ నైట్ లో పిచ్చ ఫాలోయింగ్

Olivia Morris Kekanews
Spread the love

#RRR సినిమా అప్ డేట్స్ ఇపుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మూవీకి సంబంధించి మూడు క్యారెక్టర్స్ లో ఫారిన్ యాక్టర్స్ ను తీసుకున్నామని.. వారి డీటెయిల్స్ ను #RRR టీమ్ సోషల్ మీడియాలో ప్రకటించింది.

#RRR మూవీలో ప్రధాన విలన్ గా రే స్టీవెన్ సన్ ను తీసుకున్నారు. బ్రిటీష్ గెటప్ లో ఉన్న ఆయన ఫస్ట్ లుక్ ను కూడా కూడా పోస్ట్ చేశారు. మూవీలో ఇతడి క్యారెక్టర్ పేరు స్కాట్.

#RRR మూవీలో… మరో లీడ్ విలన్ గా అలీసన్ డూడీని తీసుకున్నారు. ఈమెది బ్రిటీష్ ఎంపరర్ స్కాట్ కు భార్య క్యారెక్టర్.. లేడీ స్కాట్ ఆమె పోషిస్తున్న పాత్ర పేరు. లుక్స్ తోనే విలనీని చూపిస్తోంది ఈ యాక్ట్రెస్.

#RRR మూవీలో హీరోయిన్ పాత్రకు హాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ ను సెలెక్ట్ చేశారు. ఎన్టీఆర్ పోషిస్తున్న భీమ్ తో ఈ పాత్ర రొమాన్స్ చేస్తుంది. ఆమె గెటప్ .. క్యూట్ నెస్ ఎన్టీఆర్ అభిమానులకు కిర్రెక్కిస్తోంది. ముందుగా ఈ పాత్రకు హాలీవుడ్ నటి డైసీ ఎగ్డారీని తీసుకున్నప్పటికీ.. ఆమె తప్పుకుంది. తర్వాత… మరో హాలీవుడ్ నటికోసం రాజమౌళి చేసిన అన్వేషణ.. ఒలీవియా మోరిస్ దగ్గర ముగిసింది.

ఒలీవియా మోరిస్ ఫస్ట్ లుక్ లోనే ఇండియా, తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఆమె ఎవరంటూ గూగుల్ లో తెగ సర్చ్ చేశారు ఫ్యాన్స్. ట్విట్టర్ ట్రెండింగ్ డేటా కూడా ఇది తెలియజేసింది. ఆమె ట్విట్టర్ అకౌంట్ లో ముందు 11వందల మంది మాత్రమే ఫాలోవర్స్ ఉండేవారు. ఓవర్ నైట్ లో యాభైవేలమంది క్రాస్ అయింది. లైకర్స్ కౌంట్ ఇంకా నడుస్తోంది.

అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ , రామ్ చరణ్ అభిమానులు ఈ అప్ డేట్ తో పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కొన్నాళ్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్ డేట్ అంటూ పిచ్చెక్కిపోతున్నారు. ఇక ఇప్పుడు.. సోషల్ మీడియాను మార్మోగిస్తున్నారు.

 

(Visited 241 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *