పార్కింగ్ ఫీజు అడిగితే ఇలా చేయండి.. దూల తీరిపోద్ది

Hyderabad Parking Fees
Spread the love

హైదరాబాద్ లో ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ ముందు బండి(కారైనా.. బైక్ అయినా.) ఆపడమే లేటు. వెంటనే ఒకడు వస్తాడు. చేతిలో బుక్కుతో. తియ్ తియ్.. 5 రూపాయలు. 10, 20 రూపాయలు తియ్.. అంటాడు. ఒకవేళ ఇవ్వకపోతే.. బండి తీసి అక్కడ దూరంగా పెట్టుకోపో… అని కసురుకుంటాడు. ఏం చేయలేం. పనికావాలి కదా అని.. అతడు అడిగినంత ఇచ్చుకుంటాం. థియేటర్లు, మాల్స్ లో మొన్నటివరకు వసూలు చేయకపోయినా.. ఇప్పుడిప్పుడు కంప్లయింట్లు, మళ్లీ వసూళ్లు బాగా పెరిగిపోయాయి.

నిజానికి ఇలా పార్కింగ్ ఫీజు ఎవరూ కట్టాల్సిన అవసరం ఉండదు. వాడితో గొడవెందుకని కడుతుంటారు. ఒకవేళ కంప్లయింట్ చేస్తే ఎవరికి చేయాలో తెలియక.. పట్టించుకోం. కానీ..  ఈ పార్కింగ్ దందాను ఈజీగా అడ్డుకోవచ్చు. జీహెచ్ఎంసీ అధికారులు ఇచ్చిన సూచనతో… ఈ అడ్డదారి పార్కింగ్ ఫీజుల దందాకు మనమే చెక్ చెప్పొచ్చు.

మాల్స్ కూడా మారిపోయాయి

జీహెచ్ఎంసీ రూల్స్ ప్రకారం… హైదరాబాద్ లో కమర్షియల్ ఆఫీస్ లు, మాల్స్, పెద్ద పెద్ద దుకాణాలు, సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. అరగంట పాటు అందరికీ ఫ్రీ పార్కింగ్ ఫెసిలిటీ ఇవ్వాల్సిందే. ఒకవేళ ఎక్కువసేపు బైక్, కార్ పార్క్ చేసినట్టయితే కొనుగోలుకు సంబంధించిన ఏదైనా రిసీప్ట్ చూపిస్తే పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. ఆరునెలల కిందటివరకు బాగానే ఫాలో అయ్యారు. ఈమధ్య వాటికి కూడా కిరిమి లేస్తున్నట్టుంది. వసూళ్ల దందా మొదలుపెట్టారు.

ఇకనుంచి ఆటలు సాగవు

రూల్స్ రూల్సే. సామాన్య జనమే దొరికారా మాల్స్, థియేటర్ల యజమానులకు. కంప్లయింట్లు పెరిగిపోవడంతో.. జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ ఓ సౌకర్యం తీసుకొచ్చింది. అపార్టుమెంట్ చట్టం లోని సెక్షన్ 24, 25 కింద.. వ్యాపార సముదాయాలు, మాల్స్, సినిమా థియేటర్లు రూల్స్ కు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవచ్చని తేల్చింది. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే కంప్లయింట్ చేయడానికి ట్విట్టర్ లో ఓ దారి చూపింది.

ఎవరైనా బైక్, కార్ పార్కింగ్ కు డబ్బులు అడిగితే… రిసీప్ట్ అడగండి. ఆ రిసీప్ట్ ను ఫొటో తీసి GHMC CENTRAL ENFORCEMENT CELL ట్విట్టర్ అకౌంట్ https://twitter.com/CEC_EVDM కు ఆ బిల్లు ఫొటోను ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. మీ కంప్లయింట్ ను టైప్ చేసి.. @CEC_EVDM అని యాడ్ చేసి పోస్ట్ చేస్తే చాలు. కంప్లయింట్ ను జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు చూస్తారు. సంబంధిత సంస్థకు వెళ్లి అడుగుతారు. వాళ్లకు రూ.50వేల జరిమానా వేస్తారు. అంతే.. దూల తీరిపోతుంది. భారీ జరిమానాలకు భయపడి రౌడీలను, గూండాలను పెట్టి ఇకనుంచి డబ్బులు వసూలు చేయకుండా ఉంటారు.

(Visited 129 times, 1 visits today)
Author: kekanews