ఫస్ట్ టైమ్.. చైతూ కళ్లతో నటించాడు.. చూశారా..

https://youtu.be/KRmbTCvJ6ns
Spread the love

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా లవ్ స్టోరీ పేరుతో కొత్త మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఫీల్ గుడ్ మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ మూవీకి దర్శకుడు. స్టిల్స్ తో ఆకట్టుకున్న లవ్ స్టోరీ మేకర్స్… వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ సాంగ్ వీడియో ప్రివ్యూ రిలీజ్ చేశారు.

ఏయ్ పిల్లా అనే మ్యూజికల్ ప్రివ్యూలో వినిపించిన ట్యూన్… సీన్… డైలాగ్… కుర్రకారు మతులు పోగొడుతున్నాయి. మెట్రో రైలులో నాగచైతన్యకు సాయిపల్లవి ముద్దు పెట్టే సీన్ లో ఇద్దరి అభినయం కేక పెట్టిస్తోంది. అమ్మాయి పెట్టిన తొలిముద్దుతో నాగచైతన్య మైండ్ బ్లాంక్ అయిపోయినట్టుగా.. కొత్తదేమో అప్పుడే తెలిసినట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తాడు. ఆ సమయంలో నీళ్లు నిండిన కళ్లతో.. నాగచైతన్య పెర్ఫామెన్స్  ఆకట్టుకుంటోంది.

నాగచైతన్య లుక్స్ కే కాదు.. యాక్షన్ సీన్స్ లో బాగా నటిస్తాడనే పేరుండేది. ఇపుడు తొలిసారిగా ఓ డ్రై సీన్ లో.. తన కళ్లతో నటించిన తీరు యునానిమస్ గా ప్రశంసలు అందుకుంటోంది. అబ్బా నాగచైతన్య ఏం నటించాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

(Visited 128 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *