పండగొస్తే ఆర్టీసీ పండుగ చేసుకోవాలి.. పాడు చేసుకోవద్దు : పువ్వాడ

Spread the love

పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీకి గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతసాయం చేసిందో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు. ఇప్పటికే మునిగిపోతున్న సంస్థను మరింత ముంచొద్దని అన్నారు. పండుగలొస్తే గిరాకీలతో ఆర్టీసీ పండుగచేసుకోవాలి గానీ.. పాడుచేసుకోవద్దని అన్నారు. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా భారీ ఆదాయం వస్తుందన్నారు. ఇలాంటి టైమ్ లో యూనియన్లు సమ్మె చేయడం కరెక్ట్ కాదన్నారు. యూనియన్ నాయకుల మాటల ఆటలో కార్మికులు చిక్కుకుని ఉద్యోగాలు పోగొట్టుకోవద్దన్నారు. ఆర్టీసీలో సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, దీన్ని పట్టించుకోకుండా సమ్మె చేయడం చట్ట విరుద్దమని చెప్పారు.

ఆర్టీసీలో పదివేల బస్సులు ఉండగా… వాటిలో 2100 బస్సులను రెంట్ కు ఇస్తోంది. పండుగ వేళ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కారణంగా.. ఈ 2100 బస్సులకు అదనంగా మరో 5వేల బస్సులు నడిపేందుకు సర్కారు గ్రౌండ్ ప్రిపేర్ చేసింది. ఐదు వేల మంది తాత్కాలిక డ్రైవర్లుగా చేయడానికి ముందుకు వచ్చారన అధికారులు చెప్పారు. దీంతో 7వేలకు పైగా బస్సులు నడపడం సాధ్యమతుందన్న అంచనాలో ఉంది సర్కారు. రాష్ట్రంలోని ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేటు వాహనాల ఆపరేషన్లపై కాస్త ఉదారంగా ఉండాలని సూచించారు సీఎం. ప్రైవేటు వాహనాలకిచ్చే పర్మిట్ రుసుంలో 25 శాతం రాయితీ ఇచ్చేందుకు సీఎం ఓకే చెప్పారు. బస్సులు, డ్రైవర్లకు రక్షణ కల్పించే బాధ్యతను డీజీపీకి అప్పగించార సీఎం.

(Visited 109 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *