మహేశ్ స్టైల్.. రష్మిక అందాలు.. Mind Block వీడియో సాంగ్ రిలీజ్

Mahesh Rashmika Mind Block video Song
Spread the love

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, రష్మిక హీరోయిన్ గా నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈమూవీలోని మైండ్ బ్లాక్ సాంగ్ ను రిపీట్ గా చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూకట్టిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర మూవీ రన్ స్లో కావడంతో.. మైండ్ బ్లాక్ వీడియో ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్.

మైండ్ బ్లాక్ ఫుల్ వీడియో సాంగ్ పెట్టిన గంటలోనే మైండ్ బ్లాక్ సాంగ్ .. ఆన్ లైన్ రికార్డులను బ్రేక్ చేసేలా దూసుకెళ్లింది. మహేశ్ బాబు గ్రేస్, స్టైల్, స్టెప్పులు.. రష్మిక అందాలు, సెట్టింగ్స్, టేకింగ్… పాట కంపోజింగ్… పాటలోని ఊపునిచ్చే  డైలాగ్స్… ఇలా.. అన్నీ హైలైట్ గా నిలిచాయి. దీంతో.. వ్యూస్.. లైక్స్.. కామెంట్స్ లో… మహేశ్ అభిమానులు, మూవీ లవర్స్ చెలరేగిపోతున్నారు. సాంగ్ లోని బిట్ బిట్ నూ ఎక్స్ ప్లెయిన్ చేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. సాంగ్ లోని మెయిన్ పాయింట్స్ ను హైలైట్ చేస్తూ.. తమదైన స్టైల్ లో షార్ట్ రివ్యూలు రాస్తున్నారు ఫ్యాన్స్. మీరూ ఓసారి ఆ సాంగ్ ను చూసేయండి.

 

(Visited 317 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *