“సరిలేరు నీకెవ్వరు” బాక్సాఫీస్ తొలిరోజు కలెక్షన్లు ఇవీ

sarileru neekevvaru first day collections
Spread the love

హిట్ టాక్ తో సంక్రాంతి కలెక్షన్ల రేసులో బాక్సాఫీసు రికార్డులు దద్దరిల్లేలా చేస్తోంది మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు. ఆల్ ఓవర్ వరల్డ్ .. సరిలేరు నీకెవ్వరు మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. మహేశ్ మార్క్ యాక్షన్, కామెడీ, సాంగ్స్ ఇలా అన్ని కమర్షియల్ లెక్కలతో వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ తొలిరోజు కళ్లుచెదిరే ఓపెనింగ్స్ సంపాదించింది.

యూఎస్ లో సరిలేరు నీకెవ్వరు కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ప్రీమియర్లు, శనివారం షోలు కలుపుకుని 1 మిలియన్ డాలర్ కలెక్షన్ల మార్క్ క్రాస్ చేసింది.

ఏపీ + తెలంగాణ కలుపుకుని తొలిరోజు రూ.33.1కోట్ల కలెక్షన్లు సంపాదించింది. ఇప్పటివరకు ఆల్ టైమ్ తొలిరోజు హయ్యెస్ట్ కలెక్షన్లు సంపాదించిన టాప్ 4 సినిమాల జాబితాలో సరిలేరు చేరిపోయింది. ఒక్క నైజాంలోనే సైరాను మంచి 8.66 కోట్ల షేర్ సాధించింది మహేశ్ మూవీ.

ఓవరాల్ గా తొలిరోజు 50 కోట్ల మార్క్ చేరుకోగలిగితే  కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కిందే లెక్క. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుండటంతో మూవీకి బ్లాక్ బస్టర్ రేంజ్ కన్ ఫామ్ అయిపోయింది.

 

 

(Visited 101 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *