రూ.10లకే పుస్తకం… బుక్ ఫెయిర్ లో బంపరాఫర్

Hyderabad Book Fair
Spread the love

హైదరాబాద్ బుక్ ఫెయిర్ కు ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉంటుంది.  ఈ బుక్ ఫెయిర్ ఎప్పుడు పెడతారా… ఎప్పుడెప్పుడు పుస్తకాలు కొనుక్కుందామా అని తెలుగు రాష్ట్రాల్లోని పుస్తకాభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్లు.. జర్నలిస్టులు.. రచయితలు… కవులు.. కళాకారులు.. ఎక్కువగా ఈ పుస్తకాలు కొంటుంటారు. అలాంటి బుక్ లవర్స్ కోసం బుక్ ఫెయిర్ ట్రస్ట్ బంపరాఫర్ ప్రకటించింది.

హైదరాబాద్ కళాభారతి –ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో బుక్ ఫెయిర్ జరుగుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా… ఇయర్ ఎండింగ్ లో ఈ బుక్ ఫెయిర్ ఏర్పాటుచేస్తుంటారు. అలా.. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆరంభించి 40 ఏళ్లు గడిచిన సందర్భంగా.. తక్కువ ధరకు పుస్తకాలు అందించాలని ట్రస్ట్ డిసైడైంది. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్లు ప్రచురించిన పుస్తకాలను ఒక రూపాయి నుంచి.. రూ.10ధర మధ్య .. అత్యంత తక్కువ ధరకు అందిస్తామని ట్రస్ట్ నిర్వాహకులు చెప్పారు.

రేపటి కల, బారిష్టరు పార్వతీశం, సూర్యుడి ఏడో గుర్రం, రథ చక్రాలు, నల్లజాతి నిప్పుకణిక, మంచి – చెడు, పిల్లల రాజ్యం, పిల్లల పాఠాలు – పెద్దలకు గుణపాఠాలు, నేటి పిల్లలకు రేపటి ముచ్చట్లు, మా యాత్ర.. ఇలాంటి పుస్తకాలను రూ.1 నుంచి రూ.10 మధ్య ధరకు అమ్మాలని నిర్ణయించారు.

ఇది కూడా చదవండి : మహాద్భుతం.. యాదాద్రి ఆలయం.. Photos

ఈ పుస్తకాలు కావాలంటే.. నేషనల్ బుక్ ఫెయిర్ లోని 305 నంబర్ స్టాల్ కు వెళ్లాలి. 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు.. ఈ తక్కువ ధరలు అందుబాటులో ఉంటాయని ట్రస్ట్ ప్రతినిధులు చెప్పారు. 23 డిసెంబర్ న బుక్ ఫెయిర్ మొదలైంది. ఫస్ట్ జనవరి వరకు నడుస్తుంది. మండే టు ఫ్రైడే మ.2.30 నుంచి 8.30 వరకు ఓపెన్ చేసి ఉంచుతారు. శని, ఆదివారాల్లో మ.12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బుక్ స్టాల్స్ తెరిచి ఉంచుతారు. ఐడీ కార్డులతో వెళ్లే విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. చిల్డ్రన్, కల్చరల్, లిటరరీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజూ నిర్వహిస్తున్నారు.

(Visited 260 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *