మంత్రినే చీల్చిచెండాడింది.. దేశం జై కొడుతోంది..! సూపర్ కాప్

sunitha yadav super cop-44350572
Spread the love

సునీత యాదవ్ (Sunita Yadav ) ఇపుడు దేశంలో మోస్ట్ పాపులర్ సూపర్ కానిస్టేబుల్. ఆమె ధైర్యానికి దేశం జేజేలు పలుకుతోంది. తప్పు చేసిన ఒక మంత్రి కొడుకును బెరుకు లేకుండా నిలదీసిన ఆమెకు గవర్నమెంట్లో తిట్లు దక్కాయి గాని ప్రజల నుంచి హర్షధ్వానాలు దక్కాయి.
గుజరాత్ సూరత్‌లోని ఒక రాష్ట్ర మంత్రి కొడుకు మరియు అతని స్నేహితులు భారతదేశపు డిజాస్టర్ చట్టం ప్రకారం దేశ వ్యాప్తంగా అమలవుతున్నారాత్రి కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించారు. ఒక మహిళా కానిస్టేబుల్ సూరత్ లోని మంగద్ చౌక్‌లో చెక్ పాయింట్ వద్ద 10.30 గంటల సమయంలో వారిని గమనించి ఆపారు. కర్ఫ్యూ ఎందుకు ఉల్లంఘించారని ఆమె వారిని ప్రశ్నించారు. వెంటనే మంత్రి కొడుకు నేనెవరో తెలుసా? నన్నే ఆపుతావా ? అంటూ మంత్రి అయిన తండ్రికి ఫోన్ చేశారు. ఈ ఘటన వైరల్ అయ్యింది.

జస్ట్ ఒక కానిస్టేబుల్ అయిన నువ్వు నాకొడుకునే ఆపుతావా అని ఆ మంత్రి నుంచి, ఆయన అనుచరుల నుంచి కూడా ఆమె బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆమె స్వయంగా చెబుతున్నారు. విచారకరం ఏంటంటే… సాహోసోపేతంగా విధులు నిర్విర్తించిన ఆమెకు పోలీసుల నుంచి ఏ మద్దతు రాలేదు. పైగా తెలియని అధికారి నుంచి ఆమెకు చీవాట్లు పడ్డాయి. దీంతో ఆమె రాజీనామా చేసే పరిస్థితులు కల్పించారు. ఇలాంటి చోట నేను కూడా పనిచేయలేను అంటూ ఆమె రాజీనామా చేశారు. ఇపుడు దేశం మొత్తం ఆమె వెనుక నిలబడి ఉంది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో క్లిప్ లో గుజరాత్ ఆరోగ్య మంత్రి కుమార్ కనాని కుమారుడు ప్రకాష్ మహిళా పోలీసు సునీతా యాదవ్‌తో వాదించడం మరియు అతని శక్తి గురించి గొప్పగా చెప్పుకోవడం వినవచ్చు. ఆమె తనలో ఉన్న నిజాయితీయే అందరిలో ఉంటుందని భావించి తన ఉన్నతాధికారికి ఫోన్ చేశారు. అతను ఆమె చేసిన పనికి అభినందించకపోగా వెంటనే ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోమని కోరారు. ఉన్నతాధికారి సమాధానం మహిళా కానిస్టేబుల్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. చివరకు 24 గంటల్లో పరిణామాలు ఆమె రాజీనామా దిశగా మళ్లాయి. అంటే నిజాయితీతో ఒక భారతీయ మహిళ విధులు నిర్వర్తించడం వల్ల ఆమె చివరకు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

ఇదిలా ఉండగా ఆడియో క్లిప్‌లో మహిలా కానిస్టేబుల్ తో మంత్రి కొడుకు “365 రోజులు నువ్వున్న చోటే నిలబడేలా చేసే శక్తి తమకు ఉంది తెలుసా‘‘ అంటూ ఆమెను బెదిరించారు. దీనికి ఆమె అంతే ఘాటుగా… నువ్వు చెబితే నిలబడేందుకు నీ బానిసను కాదు, మీ నాన్న సర్వెంటును కూడా కాదని గట్టిగా సమాధానం ఇచ్చారు.

ఈ ఘటన దేశ వ్యాప్తంగా వైరల్ కావడంతో బీజేపీ మంత్రి పరువు పోయింది. ప్రజల మద్దతు కానిస్టేబుల్ సునీత యాదవ్ కే ఉంది. దీంతో పరిస్థితిని చల్లబరచడానికి మంత్రి సరికొత్తగా ప్రయత్నిస్తున్నారు. ఆస్పత్రిలో ఉన్న బంధువుల కోసం వెళ్తుండగా తన కుమారుడిని ఆపినట్లు… అక్కడ కేవలం వివరాల ఆరా తీయడం మాత్రమే జరిగింది అంతే. విచారణ జరిపాక ఎవరి తప్పంటే దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం అని మంత్రి, అధికారులు వివాదాన్ని సమసిపోయేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆధారాలు దేశం మొత్తం వినడంతో ఇది ఎక్కడకు దారితీస్తుందో చూడాలి.

News Source Check Here

(Visited 247 times, 1 visits today)
Author: kekanews