ఇది సదువుర్రి.. ఏనుగును చంపినోడే.. జింకను కాపాడిండు! వీడినేమందాం..?!

Elephant Python Deer
Spread the love

వీడు మనిషే.

వీడిలో మంచోడున్నడు..

వేస్టుముండకొడుకు కూడా ఉన్నడు.

ఒక్కోసారి వీన్ని సూడంగనే… తిర్లమర్ల నిలబెట్టి గు..మీద తన్నాలనిపిస్తది.

ఇంకోసారి.. వాన్నే మంచి పనిచేసినవ్ రా అని అల్ముకోవాలనిపిస్తది.

మనిషి వాడు.

కేరళల ఏనుగును చంపినోడు వాడే…

రోడ్డుమీద కొండ చిలువ నుంచి జింకను కాపాడింది వాడే. (ఈ వీడియోను పోస్ట్ అడుగున పెట్టిన సూడున్రి.)

రిస్క్ అని తెల్సినా.. చెట్టు కొమ్మతోని.. జింకను వడి తిప్పుతున్న పే..ద్ద కొండచిలువను అదిలిచ్చిండు. వెంటనే కొండచిలువ జింకను ఇడిషిపెట్టి చెట్లల్లకు పారిపోయింది. ప్రాణం దక్కించుకున్న జింక.. అడవిలకు ఉరికింది. ఆయనెను దేవుడంటుంది సోషల్ మీడియా లోకం. నూటికి నూరుపాళ్లు జింక పాలిట దేవుడే. మనిషి పరువు కాపాడిన దేవుడే.

ఏమందాం ఇప్పుడు. వీన్ని ఏం చేద్దాం ఇప్పుడు.

ఏనుగును చంపిన వీడి పుట్కకు అగ్గి తల్గ అని తిడ్దామా…

దేవున్లెక్క వచ్చి కాపాడినవ్ అని జింకను కాపాడినందుకు మెచ్చుకుందామా..

ఏందో పో. మనల్ని మనమే తిట్టుకుంటం. మనల్ని మనమే మెచ్చుకుంటం. కొన్నిసార్ల గమ్మతుంటయ్ మన కతలు. మన ఏషాలు.

ఏనుగును చంపినోన్ని కూడా బాంబ్ పెట్టి లేపెయ్యాలె అని పోస్టులు చాన్నే వస్తున్నయ్. నిజానికి.. ఏనుగులను చంపిన వీరప్పన్ బిడ్డకు పార్టీ టికెట్ ఇచ్చిన నాయకులు.. ఏనుగు చనిపోయిందని బాధపడ్తున్నరట. ఇది విడ్డూరమే చక్కరచ్చిపడిపోయే ముచ్చట కాదా.

ఏనుగుకు పండుల బాంబు పెట్టి చంపేటంత హౌలేగాళ్లు ఉంటరా అనేది ఇంకో ప్రశ్న. ఇలాంటిది మునుపు వినలే కదా. గట్లనే అన్పిస్తది. కని.. నిజానికి… జంగల్లల్ల…. కాయలు, పండ్లళ్ల బాంబులు పెట్టి.. అడివి పందులు పడ్తరట. అట్ల చచ్చిపోయిన అడివి పందుల మాంసం తింటరట. ఈ ఏనుగు కూడా.. గట్లనే తెల్వక ఆ పండు తిన్నదని కొందరు చెప్తున్నరు. నిజమెంతనో మరి. ఏదేమైనా.. మనిషి మాత్రం తల్కాయ తిక్కబాగున్నోడే.

https://www.facebook.com/dvshankar.rao/videos/3292150714185664/

(Visited 234 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *