కేసీఆర్ చెప్పిన ఈ మూడు పద్ధతులు.. మస్ట్ ఫాలో #CoronaVirus

kcr corona Virus
Spread the love

ఆ మూడు పద్ధతులు.. కేసీఆర్ ఊరికే చెప్పలేదు.. 

ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్న కరోనా వైరస్ గురించి రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ఒక మాట చెబుతోంది. కానీ.. రాష్ట్ర ప్రజల్లో చాలామందిలో ఇంకా మార్పు కనిపించడం లేదు. చాలాచోట్ల గుంపులు గుంపులుగానే కనిపిస్తున్నారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో జనం గుంపులు గుంపులుగా తిరగనే కూడదు. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పదేపదే చెబుతున్నారు. జనం తప్పకుండా పాటించాలంటూ ఆ మూడు విధానాల గురించి చెప్పారు.

అవే…  

1.వ్యక్తిగత నియంత్రణ

2.వ్యక్తిగత క్రమశిక్షణ

3.వ్యక్తిగత పరిశుభ్రత

ఈ మూడే కరోనాకు మందు. మెడిసిన్ లేని కరోనాను.. మన దగ్గరకు రాకుండా చేసేది ఈ మూడు పద్ధతులే. చైనా దేశం వుహాన్ కరోనానుంచి బయటపడింది కూడా ఈ 3 పద్ధతులు అనుసరించే. వాటిగురించి ఇంకొంచెం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం.

వ్యక్తిగత నియంత్రణ : కరోనా ఈ స్టేజీలో.. బయట వాతావరణంలో ఉన్నప్పుడు పక్కనున్న మనిషిని కూడా తాకొద్దు. కనీసం.. 2 మీటర్ల డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేయాలి. సోషల్ డిస్టెన్స్ ను పాటించేలా మనసును, శరీరాన్ని నియంత్రించాలి. తమను తాము కంట్రోల్ లో పెట్టుకోవాలి. బయటకు వెళ్తే కచ్చితంగా మరో మనిషిని టచ్ చేయొద్దు. గుంపులో కలవొద్దు.

వ్యక్తిగత క్రమశిక్షణ : మనం బాగుండాలి.. మంది కూడా బాగుండాలి అని కోరుకోవడమే స్వీయ క్రమశిక్షణ. వైరస్ ను ఒంట్లోకి ప్రవేశించకుండా చూసుకోవాలి. ఎదుటివారిని ఇబ్బందిపెట్టకూడదు అనే సోయితో ఉండాలి. 

వ్యక్తిగత పరిశుభ్రత : చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఒకవేళ టచ్ చేస్తే… చేతులు కడుక్కోవాలి.  ముఖానికి దగ్గరగా చేతులు రాకుండా చూసుకోవాలి. లేకపోతే.. వైరస్ కళ్లు, ముక్కు, నోటినుంచి బాడీలోకి ప్రవేశిస్తుంది.

కరోనాకు దూరంగా ఉండాలంటే… సమాజానికి దూరంగా ఉండాలి. ఇంట్లోనే ఉండాలి. అదొక్కటే మందు. ఒకవేళ అవసరమై బయటకు వెళ్తే పై మూడు సూత్రాలు పాటించాలి. అప్పుడే.. నెల రోజుల తర్వాత హాస్పిటల్ లో కాకుండా ఇంట్లోనే ఉండగలుగుతాం.

 

(Visited 118 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *