మెహెందీ వేడుకలో కాజల్ జిగేల్

Kajal Agarwal Marriage

ముంబై -(సినిమా కేక):  ప్రేక్షకులను తన అందంతో సమ్మోహనపరిచిన మిల్కీ తాజ్ మహల్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఓ ఇంటిది కాబోతోంది. అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లూను పెళ్లాడబోతోంది.

ముంబైలోని కాజల్ ఇంట్లో అక్టోబర్ 29న మెహెందీ వేడుక నిర్వహిస్తున్నారు. ఇదే రోజు.. హల్దీ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తారు. పసుపు పూసే ఈ వేడుకను ఉత్తరాదిన ఘనంగా నిర్వహిస్తారు.

మెహెందీ వేడుక సందర్భంగా చేతికి మైదాకుతో తన సోకులను ప్రదర్శించింది కాజల్. మిస్ -కుమారిగా మరింకా ఒక్కరోజు మాత్రమే ఉండబోతున్నానని.. పెళ్లితో శ్రీమతిని కాబోతున్నానని… కాబోయే వరుడితో.. కుటుంబసభ్యులతో హ్యాపీగా గడుపుతున్నానని కాజల్ సోషల్ మీడియాలో తెలిపింది. ప్రఖ్యాత డిజైనర్ అనితా డోంగ్రే డిజైన్ చేసిన లేత ఆకుపచ్చ ఔట్ ఫిట్ లో కాజల్ తన అందాన్ని ప్రదర్శించింది.

కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల్లో ఇంట్లోనే సన్నిహితుల మధ్య కాజల్ మెహెందీ, హల్దీ వేడుక నిర్వహిస్తామని చెల్లెలు నిషా అగర్వాల్ కేక న్యూస్ తో తెలిపింది.

అక్టోబర్ 30న కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక నిర్వహించనున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కానున్నారు. పలు సోషల్ మీడియా అకౌంట్స్ లో కాజల్ పెళ్లివేడుక అప్ డేట్స్ ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు.

పెళ్లి వేడుక ముచ్చట్లను కాజల్, నిషా ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా అకౌంట్లలో ప్రకటిస్తున్నారు.

https://www.instagram.com/p/CG6IGPqHkMh/?utm_source=ig_web_copy_link

(Visited 91 times, 1 visits today)