ఈ సూపర్ హిట్టు బొమ్మ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

Spread the love

గద్దలకొండ గణేశ్(వాల్మీకి) సినిమాలో జర్రా.. జర్రా.. ఐటమ్ పాటతో తెలుగు సినీ అభిమానులను ఊపు ఊపేస్తోంది ఈ అమ్మాయి. వావ్ అనిపించే ఎక్స్ ప్రెషన్స్… అదిరిపోయే స్టెప్స్… కళ్లు జిగేల్మనిపించే గ్లామర్… చూపుతోనే మాయ చేసేకళ్లు… ఇలా… ఎవరీ అమ్మాయి… దర్శకుడు హరీష్ శంకర్ ఎక్కడినుంచి పట్టుకొచ్చాడు లాంటి ఎన్నో ప్రశ్నలు చాలామందిలో వచ్చాయి. వాల్మీకి ప్రమోషన్స్ ను బాగా గమనించినవారికి మాత్రమే ఈ సంగతి తెలుసు. కానీ చాలామందికి తెలియదు. ఆ ఐటమ్ పాటలో నటించిన హీరోయిన్ ఓ తెలుగమ్మాయి అని.

ఆమె పేరు డింపుల్ హయతి. మన తెలంగాణ అమ్మాయి. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. చిన్నతనం నుంచే హీరోయిన్ కావాలని… ఇండస్ట్రీకి వెళ్లాలని కలలు కంది. కూచిపూడి నేర్చుకుని.. క్లాసికల్ డాన్సర్ అయింది. తెలుగులో రెండేళ్ల కిందట గల్ఫ్ అనే మూవీ చేసింది. ఆ తర్వాత.. తమిళంలో మోడల్ గా రాణించి.. ప్రభుదేవా, తమన్నాలతో కలిసి దేవి2లో చేసింది. హరీష్ శంకర్ … వాల్మీకి సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం.. తెలుగమ్మాయి కోసం చూస్తూ… డింపుల్ హయతిని ఎంపిక చేశారు. అలా… 21 ఏళ్లకే సెన్సేషనల్ సూపర్ హిట్ సాంగ్ తో సూపర్ హిట్టు బొమ్మ అనిపించుకుంది. అమాంతం క్రేజ్ తెచ్చుకుంది.

తెలుగు అమ్మాయి అంటే.. పద్ధతిగా ఉంటుంది. స్కిన్ షో, ఎక్కువగా ఎక్స్ పోజ్ చేయదు అనే ఒక భావన ఇండస్ట్రీలో ఉంటూ వచ్చింది. దీన్ని సాకుగాచెప్పి.. చాలా మంది డైరెక్టర్లు ముంబైనుంచి, విదేశాలనుంచి ఐటమ్ భామల పేరుతో హీరోయిన్లను దిగుమతి చేస్తుంటారు. అలా ఉండొద్దని.. తెలుగమ్మాయిలు కూడా టాప్ లేపుతారన్నది ప్రూవ్ చేయాలనుకున్నానని డింపుల్ చెప్పింది. మెగా హీరో వరుణ్ తేజ్ తో నటించే చాన్స్ మరిచిపోలేనని చెప్పింది డింపుల్.

కూచిపూడి డాన్సర్ కాబట్టే.. శేఖర్ మాస్టర్ ఇచ్చిన స్టెప్స్ వేసి.. Jarra Jarra Song లో దుమ్ములేపేసింది డింపుల్ హయతి.

ఓ తెలుగమ్మాయి.. అంతలా టాలెంట్ చూపించేసరికి… మనవాళ్లు షాకైపోతున్నారు. మంచి టాలెంట్, అందం ఉందని … అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో డింపుల్ హయతి అయితే.. యూత్ కు బాగా కనెక్ట్ అయిపోయింది.

Dimple Hayathi/Twitter

 

Dimple Hayathi/Twitter

Dimple Hayathi/Twitter

(Visited 1,125 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *