చావే పరిష్కారమా..? ఎవడు ప్రేమికుడు.. ఎవడు పిరికివాడు..?

ప్రేమ… అమాయకులతో ఆడుకుంటుంది.. బలవంతులను బలహీనులను చేస్తుంది. బలహీనులను బలి తీసుకుంటుంది.

అమ్మాయి లేకపోతే.. బతుకే లేదు..అందునా.. ప్రేమించిన అమ్మాయి కాదంటే.. ఇక జీవితమే లేదు అనే భావన ప్రేమికులను కుంగదీస్తుంది.

ఆ బరువైన హృదయాన్ని బండగా మార్చుకుని…. కన్నీళ్లకు ఆనకట్టవేసి.. మనవాళ్లకోసమే కష్టపడి బతకడంలోనే అసలైన జీవన పరమార్థం ఉంటుంది. బాగా చదువుకున్న మేధావి అయినా.. బలాదూర్ గా తిరిగే బేవార్స్ అయినా.. సమాజాన్ని మేల్కొలిపే రిపోర్టర్ అయినా.. ప్రేమ ముందు ఒక్కటే.

అసలు ఎవడు ప్రేమికుడు.. ఎవడు పిరికివాడు..?

ప్రేమలో మునిగిపోవడం.. లవ్ ను ఫుల్ లెంగ్త్ లో ఫీల్ కావడమే కాదు.. అది బలితీసుకుంటున్నప్పుడు జీవితాన్ని డీల్ చేయడమూ తెలియాలి. ప్రేమలోని కష్టాలు తెలుసుకుని జీవితాన్ని నిలబెట్టుకున్నవాడే అసలైన ప్రేమికుడు. కానీ.. ఇలా ప్రాణం తీసుకుంటే పిరికివాడికిందే లెక్క. పిరికివాడు సిసలైన ప్రేమికుడు కాలేడు. అమ్మాయిని ప్రేమించినవాడు.. ప్రపంచంలో దేన్నైనా ప్రేమించగలడు. ఆమె ఇచ్చిన విషాన్ని గొంతులోనూ దాచుకోగలడు. గుండె ముక్కలైనా .. ప్రేమించింది కాదన్నా.. జీవితాన్ని ప్రేమించేవాడే అసలైన ప్రేమికుడు.

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ టీవీ9 స్ట్రింగర్  శ్యామ్ నిన్న రాత్రి 9 గంటల టైమ్ లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పోలీస్, మీడియా వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ పెట్టి నిప్పంటించుకున్నాడు. ఇది చదవగానే పాపం.. ఎంత సున్నిత మనస్కుడో అనిపిస్తోంది కదా.. ఆయన చివరిసారి రాసి గ్రూప్ లో పోస్ట్ చేసిన సూసైడ్ లెటర్ చదివినా పాపం అనిపించకమానదు.

సూసైడ్ లెటర్ లో ఏం రాశాడు..

“  మనిద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. కలిసి తిరిగాం. ఒక కంచంలో తిన్నాం. ఓకే మంచం లో పడుకున్నాం. కార్ లో తిరిగాం. సంవత్సరం పాటు చాలా అన్యోన్యంగా ఉన్నాం. మా మధ్య లో మౌనిక వాళ్ల అక్క చంద్రిక… సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో రైటర్ సత్యం కారణంగా మేం దూరమయ్యాం. అంతేకాదు నా చిట్టి… నువ్వు  నన్ను మంది మాటలు పట్టుకొని వద్దు అన్నావ్ కదా.. కాని నేను మాత్రం నీ నుండే కాదు లోకం నుండి దూరం వెళ్తున్నా.. love you bangaram. లాస్ట్ కోరి. నా చావుకు అయినా నా ఇంటికి రారా ప్లీజ్.. గుడ్ బై బంగారం.నువ్వు చెప్పినవాళ్లు వద్దు అన్నది అన్నారే తప్ప.. ఆలోచిస్తా అన్నది అని ఎవరూ అనలేదు. అందుకే ఇలా చనిపోతున్నా. ”  అని లెటర్ రాసి.. గ్రూప్ లలో పోస్ట్ చేసి ప్రాణం తీసుకున్నాడు.

ఫీల్ తో పాటు పెయిన్ కూడా భరించాలి.. వాడే ప్రేమించాలి

లెటర్ చూస్తేనే దుఃఖం రావడం ఖాయం. రిపోర్టర్ శ్యామ్ ఎంత సెన్సిటివ్ అన్నది అతడి వర్డ్స్ లోనే అర్థమవుతోంది. మందిదేముంది .. ఏమైనా అంటారు.. మీకు మీరు ఏమనుకుంటారన్నదే ఇంపార్టెంట్. ప్రేమ ఇచ్చిన ఫీల్, ప్లెజర్, సంతోషాన్ని ఎంజాయ్ చేసిననాడే.. ప్రతి ప్రేమికుడు దాని పెయిన్ ను కూడా ఊహించాలి. ఇలా ఊహించడం కష్టం.. కానీ.. ఇది జీవితం.. ఏదైనా జరగొచ్చు.. ఇటువంటి బలహీన క్షణాల్లో ప్రాణాలు నిలబెట్టుకోవడంలోనే జీవితంలో గెలుస్తామా.. ఓడుతామా అన్నది తేలిపోతుంది. ప్రేమలో ఫెయిలైనా జీవితంలో గెలవాలన్న తపన కలిగి ఉండాలి. ప్రతి యువకుడు ఈ విషయం మనసులో పెట్టుకోవాలి.

(Visited 68 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *