మోడీని తిట్టుకోండి.. కానీ దయచేసి రేపటి కర్ఫ్యూ పాటించండి

janta curfew
Spread the love

కరోనా వైరస్ పై యుద్ధంలో భాగంగా రేపటి జనతా కర్ఫ్యూ సందర్భంగా చదవాల్సిన పోస్టు

(C.Venkatesh గారి ఫేస్ బుక్ వాల్ నుంచి..)

రేపటి జనతా కర్ఫ్యూను మోదీ గారి పబ్లిసిటీ గిమ్మిక్ అని ఎద్దేవా చేస్తూ కొందరు self-proclaimed మేధావులు పెడుతున్న పోస్టులు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. నేను కూడా మోదీ అభిమానినేమీ కాదు. కానీ రేపటి జనతా కర్ఫ్యూను నూటికి నూరు శాతం సమర్థిస్తాను.

కరోనాపై పోరులో ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. 14 గంటల పాటు జన సంచారం నిలిచిపోతే ఆ వైరస్ వ్యాప్తి తాలూకు chain break అవుతుంది. ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా వైరస్ క్రిములు చనిపోయే వీలుంటుంది. దీని వల్ల వ్యాధి వ్యాప్తిని చాలా వరకూ నిరోధించగలుగుతాం. ప్రస్తుతం మనం కరోనా విషయంలో second stageలో ఉన్నాం. దీన్ని local transmission అంటారు. అంటే బయటి దేశాల నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారికి వ్యాధి సోకిన దశ.

ఇప్పటి వరకు ఫరవాలేదు. కానీ మూడో దశ community transmission. మన జనాభా వల్ల ఈ దశను ఎదుర్కోవడం అతి పెద్ద సవాల్. మనకున్న వైద్య సదుపాయాలు ఏ మూలకూ సరిపోవు. అందుకే రేపటి కర్ఫ్యూను పాటించడం బాధ్యత గల పౌరులుగా మనందరి కర్తవ్యం. ఇక్కడ ఎజెండాలు పక్కన పెట్టండి. మోదీ గారిని తిట్టుకోడానికి ఆయన చాలా అవకాశాలిస్తాడు. ఇక్కడ మాత్రం రాజకీయాలను పక్కన పెట్టి అందరం రేపటి కర్ఫ్యూను సమర్థిద్దాం. మైడియర్ సోకాల్డ్ మేధావుల్లారా మీరు రేపటి కర్ఫ్యూ పాటించక పోతే పోయారు. దాన్ని వ్యతిరేకిస్తూ పోస్టులు మాత్రం పెట్టద్దని చేతులు జోడించి కోరుతున్నాను. 

 

 

(Visited 114 times, 1 visits today)
Author: kekanews