విజయ్ మాల్యా… ఎప్పటికీ కింగ్ఏ..!

Vijay Malya King Fisher

ఇది కొందరికి నచ్చొచ్చు.. కొందరికి నచ్చకపోవచ్చు. కానీ ఇది ఓ అభిప్రాయం. చాలా భిన్నమైన అభిప్రాయం. చదివితే నిజమే అనిపించక మానదు. మరి చదివేయండి.

Credit : Jagan Rao…

యునైటెడ్ స్పిరిట్స్ అనేది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆల్కహాలిక్ బీవరేజెస్ కంపనీ. బెంగుళూరు లోని విట్టల్ మాల్యా రోడ్ లో విజయ్ మాల్య టవర్స్ లో ఒక అంతస్థు లో ఉంటుంది దాని హెడ్ క్వార్టర్స్. దానికి గతంలో విజయ్ మాల్యా చైర్మన్ గా పనిచేశాడు. ప్రస్తుతం యునైటెడ్ బీవరేజ్ కి అతనే చైర్మన్. నాకు తెలిసి ఇండియన్ మార్కెట్ లో ఇప్పటికీ 40% బ్రీవింగ్ అతని కంపనీలదే. కింగ్ ఫిషర్ లాంటి బీర్లు, ఫేమష్ లిక్కర్ బ్రాండ్స్ 79 యునైటెడ్ బ్రీవరీస్ వారే తయారు చేస్తారు, అవి 120 దేశాలకి పైగా అమ్ముడుపోతాయి.
2007 ఆ ప్రాంతం లో మన దేశం లో 70% వరకు ఆల్కహాలిక్ యాపారం మార్కెట్ షేర్ అతని ఆధీనం లోనే ఉండేది. బీర్లలో కింగ్ ఫిషర్ లైట్, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ ఆ రోజుల్లో నంబర్ వన్. నూతనం గా ఆలోచించి స్వదేశీ ఎయిర్ లైన్స్ ఉండాలి అనుకున్నాడో ఏమో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ స్థాపించాడు. నాలుగు విమానాలతోనే ప్రారంభించాడు బొంబాయి నుంచి ఢిల్లీ కి. ఆ తర్వాత చిన్నగా విస్తరించుకుంటూ ఇంటర్నేషనల్ కింగ్ ఫిషర్ విమాన సేవలని కూడా ప్రారంభించాడు. ఒక అమెరికన్ వ్యాపారవేత్త దానిలో ప్రయాణించి ఇలాంటి ఆధునిక సదుపాయాలు ఉన్న ఎయిర్ లైన్స్ నా జీవితం లో చూడలేదు, ఇది ఇండియన్ ఎయిర్ లైన్స్ అని నాకు తెలియదు, చాలా అద్భుతం గా ఉంది కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అని చెప్పటం నాకు ఇంకా గుర్తు.
ఆ రోజు నేను కాలర్ ఎగరేసుకొని నా దేశ నాణ్యత కి ఉప్పొంగిపోయి 6 కింగ్ ఫిషర్ లైట్ బీర్లు తాగటం ఇప్పటికీ మరచిపోలేదు.
2008 లో వచ్చిన ఆర్ధిక మాంధ్యం వలన ఓడలు బండ్ళు అయ్యాయి, బండ్లు ఓడలు అయ్యాయి (చైనా సూపర్ పవర్ అయ్యింది అప్పుడే). విజయ్ మాల్యా గారి నూతన ఆలోచనా విధానం వలన అంత పెద్దగా ఏమీ నష్టపోలేదు. కానీ ప్రపంచ విమాన రంగం లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి, విదేశీ శక్తుల చూపులు ఇండియా వైపు పడ్డాయి. ఇతిహాద్ అనే అరబ్బు విమాన సంస్థ మరియూ ఇతరులకి జరిగిన పోటీలో ఇంకా ఆర్ధిక మాంధ్య ఛాయలు వలన, ఎయిర్ పోర్ట్స్ ల్లో పెంచిన ట్యాక్స్ వలన, క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతం గా పెరగటం వలన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కొంత నష్టాల్లోకి పోయింది, నాకు తెలిసి 6000 కోట్లు బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నాడు, అది వడ్డీతో 9000 కోట్లు అయ్యిందో లేక ఖచ్చితం గా ఎంత, ఎలా అప్పు తీసుకున్నాడో అతని లాయర్లకి, ఆడిటర్ల కి బ్యాంకులకి మాత్రమే తెలుసు.
ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వెనక జరిగిన కుట్రలు తెలియాలి అంటే, మళ్ళీ నేను బార్ కి వెళ్ళి 4 కింగ్ ఫిషర్ బీర్లు తెమ్మని అంటే కింగ్ ఫిషర్ బీర్లు లేవు సార్, బడ్ వైజర్, కరోనా లైట్ ఉంది అన్నాడు. అవి అన్నీ పాశ్చాత్య బీర్లు. చిన్న పిలగాడి ఉచ్చ కంటే హీనం గా ఉంటై పాశ్చాత్య బీర్లు. బయట దేశాల్లో తాగేవాళ్ళు అక్కడి వాతావరణానికి అనువుగా చాలా మైల్డ్ గా ఉంటై. వాళ్ళు ప్రతి రోజూ లేదా వారం మనం మంచినీళ్ళు తాగేటట్లు వాళ్ళు బీర్లు తాగుతారు. అవి ఎందుకు మన దేశ మార్కెట్ లోకి వచ్చాయో నాకు తెలియదు, ఎలా వచ్చాయో నాకు తెలియదు, ఎందుకు వచ్చాయో నాకు తెలియదు.
మామూలు లిక్కర్ షాప్ వాళ్ళే కోటాను కోట్లు సంపాదిస్తుంటే 70% ఇండియన్ మార్కెట్ లో ఆల్కాహాల్ ని తయారు చేసే విజయ్ మాల్యా గారు పాపం ఎందుకు బ్రిటన్ వెళ్ళాల్సి వచ్చిందో నాకు తెలియదు. ఆ తర్వాత 40% మాత్రమే మార్కెట్ ని ఏలటం, మిగతా 60% లో ఉచ్చ కంటే హీనం గా ఉండే పాశ్చాత్య లో క్వాలిటీ ఫారెన్ బీర్లు, బ్రాండ్స్ రావటం ఏందో ఎంత ఆలోచించినా నాకు దాని వెనక ఏమి జరిగిందో తెలియదు.
అమెరికాలో డెట్రాయిట్ నగరాన్ని మోటర్స్ నగరం అంటారు. ఎక్కువ కార్లు తయారు చేసే కంపనీస్ అక్కడ ఉంటై. ముఖ్యం గా జనరల్ మోటర్స్, అమెరికన్ బ్రాండ్స్ ఫోర్డ్స్ మొదలగునవి ఉంటై. అయితే 2008 లో వచ్చిన ఆర్ధిక మాంధ్యం వలన దెబ్బతింటే అక్కడి ప్రభుత్వం జపాన్ టయోటా కార్లని ఎదుర్కోవాలన్నా, కొరియా కియా మోటర్స్ ని, హండయ్ ని ఎదుర్కోవలన్నా స్వదేశీ వాటిని ప్రోత్సహించాలని కొన్ని మిలియన్స్, బిలియన్స్ సహాయం చేశారు. బ్రోతల్ కంపనీస్ నష్టాల్లో ఉంటే వాటికి కూడా కొంత సహాయం చేశారు అక్కడ.
మన దగ్గర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా పాశ్చ్యాత్య కియా మోటార్స్, అమెజాన్ లాంటివి వస్తుంటే అలాంటి వాళ్ళకి వేల కోట్ల భూములు, మిగతా సదుపాయాలు కల్పించటం మనం చూస్తూనే ఉన్నాం.
మరి విజయ్ మాల్యా సొంత వాడు అవటం అతను చేసిన తప్పా..? స్వదేశీ బీర్లని క్వాలిటీ తో, నాణ్యత తో ప్రపంచం అంతా విస్తరింప చేయటం అతను చేసిన తప్పా..? అమెరికా, బ్రిటన్ అమ్మా మొగుడు లాంటి అత్యధునిక ఇండియన్ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ని స్థాపించటం అతను చేసిన తప్పా..?
బ్యాంకుల దగ్గర తీసుకున్న ఎమౌంట్ ఖచ్చితం గా అతను కట్టాల్సిందే; కానీ దానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేసి ఉంటే ఇప్పుడు భారతీయ బ్రాండ్ లక్షల కోట్లు సంపాదించి ఉండేది మరియూ ప్రపంచంలో అత్యధునికమైన విమాన సంస్థల్లో మన కింగ్ ఫిషర్ ఉండేది. ప్రస్తుతం కింగ్ ఫిషర్ నే కాదు చాలా దేశీయ విమాన సంస్థలు మూసి వేయాల్సి వచ్చింది. ఆ స్థానం లో విదేశీ సంస్థలు ప్రవేశించాయి.
విజయ్ మాల్యా గారి తండ్రి విట్టల్ మాల్యా గారు కూడా పెద్ద వ్యాపార వేత్త. బెంగుళూరు లో విట్టల్ మాల్యా రోడ్, UB సిటీ మాల్, UB టవర్స్, ఇంకా యునైటెడ్ బ్రీవరీస్ అన్నీ వాళ్ళవే. కలకత్తా లోని మంచి కాలేజ్ లో చదువుకున్నాడు విజయ్ మాల్యా. నాణ్యత కి మొదటి స్థానం ఇచ్చే మనిషి. మర్డర్లు చేయలేదు, మాన భంగాలు చేయలేదు. నాకు తెలిసిన విజయ్ మాల్యా దేశీయ క్వాలిటీ దేశీయ ప్రొడక్ట్స్ ని మాత్రమే తయారు చేశాడు.
అతని మీద కేసుల విషయం లో నేను వ్యాఖ్యానించదలచుకోలేదు. అవి కోర్టుల్లో ఉన్నై కాభట్టి న్యాయస్థానం ఏది తీర్పు ఇస్తే దాన్ని నేను గౌరవిస్తాను. కానీ విదేశీయుల కుట్రల్లో మనం కూడా ఇరుక్కుపోయి దొంగ మల్లయ్య అని పేపర్లు, TV లు హెడ్డింగ్స్ పెడుతుంటే మనస్సుకి చాలా బాధ అనిపిస్తుంది, మన కంటిని మనమే పొడుచు కుంటున్నామన్న స్ప్రుహ కొంచెమైనా ఉందా అనిపిస్తుంది.
నా మటుకు విజయ్ మాల్యా పేరు వినపడితే క్వాలిటీ గుర్తుకు వస్తుంది, దేశీయ నాణ్యత కలిగిన ప్రొడక్ట్స్ గుర్తుకు వస్తుంది.ఆయన పేరు వినపడితే చాలు జేబులో చేతులు పెట్టుకొని బార్ కెళ్ళి 4 కింగ్ ఫిషర్ బీర్లు తాగుతా గర్వం గా. టాటా ప్రొడక్ట్స్ తర్వాత నాకు తెలిసి అత్యున్నత నాణ్యత కలిగిన ప్రొడక్ట్స్ విజయ్ మాల్యా గారివే. రతన్ టాటా గారు అంటే ఎంత గౌరవమో, విజయ మాల్యా గారు అంటే కూడా అంతే గౌరవం నాకు.
No matter what, I admire you sir🙏.

– జగన్

(Visited 59 times, 3 visits today)

Next Post

క్లియోపాత్ర.. అంటే అందమే కాదు..! ధైర్యం.. సాహసం కూడా

Tue Oct 13 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="http://www.kekanews.com/interesting-article-on-vijay-malya-2983-2/"></div>క్లియోపాత్ర ది గ్రేట్ : ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర మహా అందగత్తె గానే ప్రపంచానికి పరిచయం. కానీ క్లియో పాత్ర అంటే ఒక ధైర్యం, క్లియోపాత్ర అంటే ఒక సాహసం, అన్నీటికి మించి క్లియోపాత్ర అంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్.అప్పటివరకు నాణేల మీద మగ రాజుల ముద్రలు మాత్రమే ఉండేవి; నాకు తెలిసి చరిత్రలో మొదటి సారి నాణేలపై ఆడ రాణి ముద్రలు కూడా ఉండటం క్లియోపాత్ర తోనే ప్రారంభం […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="http://www.kekanews.com/interesting-article-on-vijay-malya-2983-2/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..