ఏపీలో డేంజర్.. 40 కేసులు ఎక్కడినుంచి వచ్చాయో ట్రేస్ కావట్లేదు..!!

ap corona update kekanews
Spread the love

కరోనాను కట్టడి చేయాలంటే .. ట్రేసింగ్ చాలా ముఖ్యం. ఓ పేషెంట్ కు కరోనా సోకితే.. అతడికి ఎలా వచ్చింది.. ఎవరి నుంచి వచ్చింది లాంటి కాంటాక్ట్ మస్ట్ గా తెలియాల్సిఉంటుంది. అలా తెలిసినప్పుడు.. కరోనా కంట్రోల్ లో ఉన్నట్టే లెక్క. ఏదైనా కేసులో.. ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చి..అది ఎలా వచ్చిందో తెలియకపోతే.. పరిస్థితి ప్రమాదకరంగా మారినట్టే. ఏపీలో 40 మంది పేషెంట్లకు కరోనా ఎలా సోకిందో తెలియడం లేదని ఆ రాష్ట్ర అధికారులు చెప్పారు. ట్రేసింగ్ చేసే పనిలో పడ్డారు.

దగ్గు, జలుబు, జ్వరం మందులు కోసం వచ్చిన వాళ్లకు నేరుగా మందులు ఇవ్వవద్దని చెప్పారు. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల కోసం ఎవరైనా వస్తే… సదరు వ్యక్తి ఇంటి చిరునామా, ఫోన్ నంబర్ వెంటనే తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

కరోనా బాధితుడికి.. ఆ వైరస్ ఎక్కడ నుంచి సోకిందో తెలియకుంటే కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ ఉన్నట్టేనని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. ఏపీలో సుమారు 40 కేసుల్లో వైరస్ ఎక్కడి నుంచి సోకిందో ట్రేస్ కావడం లేదన్నారు. మెడికల్ షాపుల నుంచి సమాచారం సేకరిస్తున్నామన్నారు. దగ్గు, సర్ది, జ్వరం ఉందంటూ .. ఎవరైనా మందుల కోసం వస్తే.. వారి వివరాలు చెప్పాలని మెడికల్ షాప్ నిర్వాహకులను కోరామన్నారు. కరోనాకు మందు వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాల్సిందేనని చెప్పారు అధికారులు.

(Visited 75 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *