కరోనా రాగానే కనిపించే మొదటి లక్షణం ఇదే

Corona Virus Symptoms
Spread the love

ఇది చదివేముందు ఓ విషయం గుర్తుపెట్టుకోండి. కరోనా అనేది డెంగ్యూ, టైఫాయిడ్, న్యూమోనియా అంత డేంజర్ వ్యాధి ఏమీ కాదు. కొన్ని జాగ్రత్తలతో ఒకట్రెండు వారాల పాటు సులభమైన చికిత్స ఇంట్లో తీసుకుంటే దాని బారినుంచి బయటపడొచ్చు అనే విషయం గుర్తుపెట్టుకోండి.

కరోనా లక్షణాలు సాధారణంగా 2 నుంచి 14 రోజుల గ్యాప్ లో ఓ మనిషిలో బయపడుతుంటాయి. వీటిలో.. పొడిదగ్గు అనేది ఎక్కువ మందిలో కనిపిస్తోంది. శ్లేష్మం రాకుండా.. గొంతు దగ్గర కొంత ఇబ్బందిగా అనిపించి వచ్చే పొడిదగ్గు ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి.

మైల్డ్ సింప్టమ్స్ లో చాలామందిలో కనిపించేవి నీరసం, జ్వరం.

ఏదైనా పనిచేయడానికి బద్దకించినట్టుగా అనిపిస్తూ నీరసంగా ఉండటం.. దాన్నుంచి కొంచెం ఒళ్లునొప్పులు.. హెడేక్ వరకు వెళ్తుంది.  వీటితోపాటే.. కొద్దిగా జ్వరం కూడా వస్తుంది. ఈ జ్వరం పారాసిటామల్ వేసుకోగానే తగ్గిపోతుంది. ఐతే… 3,4 రోజులపాటు.. ఇలాగే కంటిన్యూయస్ గా టాబ్లెట్ వేసుకున్నప్పుడు తగ్గటం.. తర్వాత మళ్లీ వస్తూ ఉంటే అప్పుడు కరోనా వైరస్ గా అనుమానించవచ్చు.

వీటితో పాటే.. చాలా ముఖ్యమైన మరో 2 లక్షణాలు స్మెల్ పోవడం, టేస్ట్ తెలియకపోవడం. కరోనా తొలిదశలో గుర్తించేందుకు ఇదే కీలకం. డ్రై కఫ్, జ్వరం, నీరసం చాలామందిలో రెగ్యులర్ గా కనిపించేవే అయినా… వీటికి జోడీగా మిగతా లక్షణాలు కలిసి కనిపించినప్పుడు కొంచెం జాగ్రత్తపడటం మంచిది.

కరోనా వైరస్ ఒక ఆర్గాన్ నుంచి.. మరో ఆర్గాన్ కు షిఫ్ట్ అవుతున్నప్పుడు కొత్త లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో కళ్లు ఎర్రగా మారడం, లూజ్ మోషన్స్ హెవీగా ఉంటాయి.

వైరస్ త్రోట్ వరకు పరిమితం అయినప్పుడు డ్రై కాఫ్ వస్తుంది. ఆ తర్వాత.. సింప్టమ్స్ ఒక్కొక్కటిగా బయటపడొచ్చు. కరోనా లో ఫస్ట్ వచ్చేది డ్రై కఫ్. ఆ తర్వాత.. ఫీవర్, చిన్నగా బాడీ పెయిన్స్ మొదలవుతాయి. తర్వాత.. హెడేక్ కూడా వస్తుంది. ఈ లక్షణాలు కనిపించినా.. చాలామంది లైట్ తీసుకుంటారు. అది సహజమే. ఐతే… ఆయాసంతో దగ్గు వస్తున్నప్పుడు.. అలర్ట్ కావాలి. టెస్ట్ చేసుకోవాలి. డాక్టర్లు RTPCR మాలిక్యులార్ టెస్ట్ చేస్తారు. ఇందులో పాజిటివ్ వస్తే.. సింప్టమ్స్ తగినట్టుగా మందులు వేసుకుంటూ ఇమ్యూనిటీ పెంచే పండ్లు, టాబ్లెట్లు తీసుకోవాలి.

కరోనా వైరస్ తగ్గిపోయాక సీరలాజికల్ టెస్ట్ చేస్తారు. మన బాడీలో కరోనాతో ఫైట్ చేయగలిగే యాంటీబాడీస్ ఎంతవరకు ప్రొడ్యూస్ అయ్యాయనేది అందులో తెలుస్తుంది. యాంటీబాడీస్ బాగా ఉంటే… ఒకవేళ మళ్లీ కరోనా సోకినా.. దానికదే నశిస్తుంది.

టెస్టుల్లో పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల్లో సివియర్ సింప్టమ్స్ పెద్దగా ఉండవు. పెద్ద ఏజ్ వాళ్లు, గర్భిణిలు ఈ లక్షణాలను తమలో గుర్తిస్తే.. ఇంట్లో ఉండి జాగ్రత్తలు తీసుకుంటూ రికవరీ కావొచ్చు. లక్షణాలు లేకపోయినా.. ఇమ్యూనిటీ పెంచే ఆహారం తీసుకుంటే అంతకుమించిన వ్యాక్సిన్ ఇంకొకటి లేదు.

(Visited 144 times, 1 visits today)
Author: kekanews