బై డాడీ.. బై..! థూ.. ఈ సర్కారు వైద్యం బతుకు చెడ..! సంపుతార్రా జనాల్ని..!

HeartBreaking Death
Spread the love

రానురాజు రాజుగారి గుర్రం గాడిదైందట. అలా ఉంది మన ప్రభుత్వం, సర్కారు వైద్యం పనితీరు చూస్తుంటే అని అనుకుంటున్నారు పబ్లిక్.

మొదట్లో కరోనా వస్తోందంటే సర్కారు ఏం చేసినా.. ఇంట్లో కట్టేసినా జనం సమర్థించారు. మనకోసమే చేస్తోంది కదా అనుకున్నారు. కానీ.. కరోనాతో చావులు తక్కువే ఉన్నాయి. జాగ్రత్తలతో తగ్గిపోతోంది అని తెల్సినా కూడా.. మన సర్కారు.. చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. చావుబతుకుల్లో ఉన్న ఆ కొద్ది మందిని కూడా కాపాడలేకపోతోంది మన దరిద్రపు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ.

తాజాగా.. హైదరాబాద్ చెస్ట్ హాస్పిటల్ లో ఓ వ్యక్తికి ఆక్సిజన్ తొలగించడంతో… దారుణ పరిస్థితుల్లో చనిపోయాడు. చివరిసారిగా బై డాడీ బై అంటూ.. ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియో సర్కారు దవాఖానాల్లో పరిస్థితికి అద్దం పడుతోంది.

“వెంటిలేటర్ పీకేసిర్రు. ఊపిరాడుతలేదు అంటుంటే కూడా పెడ్తలేరు. చచ్చిపోతున్నా. అందరికి బాయ్ డాడీ..” అంటూ తుదిశ్వాస విడిచే ముందు బాధితుడు తీసుకున్న వీడియో గుండెల్లో ఆవేదనను రగిలిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రైనా , ప్రైవేటు ఆసుత్రులైన కరోనా వస్తే చికిత్స ఇంతే దారుణమా..? అనిపిస్తోంది.

కరోనాతో హైదరాబాద్ చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పోరేషన్, బి.జే.ఆర్ నగర్ కి చెందిన వ్యక్తి… మృతి చెందే కొన్ని నిమిషాల ముందు తన ఫోన్ లో తీసుకున్న వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.  మృతుడి మాటలు… ఊపిరాడటం లేదని చెప్పే మాటలు వింటే.. సర్కారు దవాఖనాల్లో సర్కారీ వైద్యం ఎలాఉందో చెబుతున్నాయి. పాపం అతడు చెప్పినా కూడా వినకుండా.. మీకు ఆక్సిజన్ టైమ్ అయిపోయింది.. వేరేవాళ్లకు పెట్టాలి అనుకుంటూ.. తీసుకెళ్లిపోయారని అతడి మాటల్లో తెలుస్తోంది. మొస మొర్రుతలేదని..ఉండనియ్యిర్రి అంటున్నా.. వెంటిలేటర్ బంజేసిర్రనీ.., బతిమిలాడుతుంటే.. సాల్ సాల్ ఐపోయిందని తీసుకుపోయారని చెప్పాడు.

ఆక్సిజన్ సిలిండర్ లు ప్రభుత్వ హాస్పిటళ్లలో సరిపోయే అన్ని లేవు అనేది కూడా ఇక్కడ తెలిసిపోతోంది. ఒకే సిలిండర్ ను.. మార్చి మార్చి.. చాలామందికి విడతలవారీగా వాడుతున్నారని కూడా తెలుస్తోంది. సాల్ సాల్.. అంటే ఏంటన్నట్టు. అదేదో ఓ పూట అన్నం తిన్నట్టు.. ఓ గ్లాస్ చాయ్ తాగినట్టో కాదు కదా. ఆక్సిజన్. అది లేకపోతే.. డేంజర్ స్టేజీలో ఉన్నవాడు చనిపోవుడమే కదా. ఆక్సిజన్ సిలిండర్లు క్రిటికల్ పేషెంట్లకు కూడా సరిపోయినన్ని లేవా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికి మూడు గంటలైంది డాడి.. నాకు ఊపిరాడుతలేదు డాడి.. గుండె ఆగిపోయింది డాడి.. ఊపిరొక్కటే కొట్టుకుంటుంది డాడి.. బాయ్ డాడి బాయ్.. అందరికి బాయ్ డాడి… వద్దన్నా గవర్నమెంటు హాస్పిటల్ లో నన్ను జాయిన్ చేపించినవ్ ఇపుడు నేను సచ్చిపోతున్న” అంటు హైద్రాబాద్ లోని ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ నుండి బాధితుడు చివరి క్షణంలో మాట్లాడిన వీడియో పరిస్థితి ఎంతదారుణంగా ఉందో చెబుతోంది.

కరోనా మహమ్మారి అంత డేంజర్ కాకపోయినా.. ప్రమాదంలో ఉన్న పేషెంట్ల ఊపిరిని సర్కారు వైద్యమే ఆపేస్తోంది. ఇలాంటి ఇంకెన్ని హార్ట్ బ్రేకింగ్ దారుణాలు చూస్తే గానీ.. మన ప్రభుత్వ వైద్యం బాగుపడుతుందో ఆ దేవుడికే తెలియాలి. థూ… వైద్యం అందిస్తున్న ఈ ప్రభుత్వాల బతుకు చెడ.

(Visited 99 times, 1 visits today)
Author: kekanews