గంగవ్వ కంటెస్టెంట్… మార్కులు కొట్టేశావ్ రా బిగ్ బాస్..!

Gangavva biggbossTelugu Season 4 Contestant

15 మంది కంటెస్టెంట్లు ఒకెత్తు.. చివర్లో వచ్చిన ఆ ఒక్క బామ్మ మరో ఎత్తు. ఆమె ఎవరో కాదు.. తెలంగాణ మాటకు, మర్యాదకు, కట్టుకు, పద్ధతులకు పట్టుకొమ్మ. గంగవ్వ. ఓల్డేజ్ నాగార్జున చెప్పినట్టు.. ఆమె ఎంట్రీతోనే ఓ అటెన్షన్ క్రియేట్ అయింది. ఒక్కో కంటెస్టెంట్ ను ప్రకటిస్తూ వెళ్తున్నకొద్దీ.. కొన్నివారాలు ఈ ప్రోగ్రామ్ కు దూరంగా ఉండటం బెటర్ అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. షోలో ఏదైనా టర్నింగ్ పాయింట్ ఉన్నప్పుడు చూద్దాంలే అని చాలామంది అనుకుంటున్న టైంలో.. రేపటి ఎపిసోడ్ ను కూడా చూసేయాలన్నంత ఆసక్తి ఆ ఒక్క కంటెస్టెంట్ తోనే వచ్చింది.

గంగవ్వకున్న స్పెషాలిటీ అది. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే మనిషి గంగవ్వ. ప్రైజ్ మనీ గెల్చుకుంటే ఏం చేస్తవ్ అని నాగార్జున అడిగినప్పుడు.. అబ్బా గది నాకొస్తదా సారూ అని ఆమె చెప్పిన మాటకు అంతా ఫిదా అవ్వాల్సిందే. ఇంతమందిల అదృష్టం ఎవరికుందో.. ఇప్పుడే చెప్పరాదు.. నేను చివరిదాకా ఉంటానన్న నమ్మకం లేదని గంగవ్వ చెప్పింది. అదీ ఆమె సింప్లిసిటీ.

మై విలేజ్ షోతో పాపులరైన గంగవ్వ.. సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసే స్థాయికి ఎదిగింది. ఐనా.. ఆమె తీరులో మార్పు  రాలేదు. గంగవ్వ మాట సూటిగా ఉంటుంది. ఆమె విమర్శ కూడా అంతే షార్ప్ గా ఉంటుంది. ఆమె అనుభవమే ఆమెకు ఓట్లు తెస్తాయని చెప్పొచ్చు. ఆవేశపడేవారికి క్లాస్ పీకాలి.. అణిగిమణిగి ఉండేవారికి ధైర్యం చెప్పాలి.. ఆమె నిజాయితీ ఫస్ట్ ఎపిసోడ్ లోనే అర్థమైపోయింది. గంగవ్వ ఇలా ఉంటే చాలు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుందనడంలో సందేహమే లేదు. ఆల్ ద బెస్ట్ గంగవ్వ.

(Visited 220 times, 1 visits today)