గడ్డి తింటావా… తౌడు తింటావా..? RGV పవర్ స్టార్ ఫస్ట్ సాంగ్ కిర్రాక్

ఈ పాటపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మంటలేపుతోంది. డిజ్ లైక్స్, కామెంట్స్ తో తమ కోపం తీర్చుకుంటున్నారు పవన్ అభిమానులు.  

Gaddi Thintava Song | Powerstar Movie Songs

పవర్ స్టార్ పేరుతో రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమాపై ఇప్పటికే సినిమా అభిమానుల్లో చాలా ఆసక్తి ఏర్పడింది. పొలిటికల్ స్పూఫ్ లతో లో క్వాలిటీ సినిమాలు తీస్తూ… కమర్షియల్ గా గిట్టుబాటు చేసుకుంటున్న రామ్ గోపాల్ వర్మ.. పవన్ కల్యాణ్ పై లేటెస్ట్ గా పొలిటికల్ సెటైరికల్ సినిమా తీస్తున్నాడు.

గడ్డి తింటావా.. తౌడు తింటావా అంటూ.. సాగే పాటలో.. పవన్ కల్యాణ్ ఈ పరిస్థితుల్లో ఏమనుకుంటున్నారన్నది కామెడీగా చూపించాడు వర్మ. ఓటు వేస్తారనుకుంటే పోటు పొడిచారనీ… వెన్ను పోటు పొడిచారని… దేవుడు అని కొందరన్నారనీ.. చివరకు ఇలా జరిగిందంటూ రాసిన లిరిక్స్ ఫన్నీగా అనిపిస్తున్నాయి. నెత్తికెక్కించుకున్న ఫ్యాన్స్ తనను నిండా ముంచారని పవన్ అనుకుంటున్నట్టుగా లిరిక్స్ రాశారు.  బండ్లగణేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, చంద్రబాబులపై వర్మ సెటైర్స్ మామూలుగా లేవు. ఒకడు దేవుడన్నాడు.. ఇంకొకడు ఆకు డైలాగులిచ్చాడు.. ఇంకొకడేమో నెత్తినపెట్టుకున్నాడు.. అంటూ ఆ మూడు క్యారెక్టర్స్ ను చూపించాడు వర్మ. న్యూట్రల్ మూవీ, పొలిటికల్ వాచర్స్ కు ఇది ఫన్నీగా అనిపిస్తుంది.  ఐతే.. ఈ పాట పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మంటలేపుతోంది. డిజ్ లైక్స్, కామెంట్స్ తో తమ కోపం తీర్చుకుంటున్నారు పవన్ అభిమానులు.

 

(Visited 59 times, 1 visits today)

Next Post

షేప్ అదిరింది.. ఇలియానా సన్నబడింది..

Sun Jul 19 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="http://www.kekanews.com/gaddi-thintava-song-powerstar-movie-songs-rgv/"></div>అందాలకు సాన బెడుతున్న ఇలియానా కష్టాన్ని తక్కువ అంచనా వేయలేం... డెడికేషన్ ఉంటేనే ఇలాంటిది సాధ్యం. కేకన్యూస్.కామ్<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="http://www.kekanews.com/gaddi-thintava-song-powerstar-movie-songs-rgv/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->
Ileana Dcruz

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..