భల్లా ఈజ్ బ్యాక్.. రానా అరణ్య మేకింగ్ వీడియో

rana aranya
Spread the love

అరణ్య -Aranya సినిమాలో రానా నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నటుడిగా వేరియేషన్ చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు దగ్గుబాటి రానా. బాహుబలిలో భల్లాలదేవుడిగా నటించి యావద్దేశం , ప్రపంచం ప్రశంసలు అందుకున్న ఈ కండల వీరుడి సినిమా ప్రస్థానం చాలా ప్రత్యేకం.

ఇమేజ్ లో ఇరుకడు. ఓ పట్టాన కొరుకుడు పడడు. రానా ఇలాంటి సినిమాలే చేస్తాడు అని కూడా చెప్పలేం. తెలుగుతో పాటే.. బాలీవుడ్ లోనూ నటిస్తాడు.  సౌత్ లోనూ మెరుస్తాడు. ఆయన సినిమాలు ఎంచుకునే విధానమే వేరు. అలా..ఆయన చేస్తున్న లేటెస్ట్ మూవీనే అరణ్య.

ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మాణంలో ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన మూవీ అరణ్య. హాథీ మేరీ సాథీ పేరుతో హిందీలో.. కాదన్ పేరుతో తమిళ్ లో రిలీజ్ కు రెడీ అయింది. అడవిలో రానా పడిన కష్టాన్ని మేకింగ్ వీడియోగా విడుదల చేశారు. రానా డెడికేషన్ కు నెటిజన్లు జేజేలు చెబుతున్నారు.

(Visited 115 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *