కరోనా మెడిసిన్ ఫ్యాబిఫ్లూ ఎలా వేసుకోవాలి.. 14 రోజుల ఖర్చు ఎంతంటే..?

Covid Medicine
Spread the love

కరోనా రోగులు కోలుకునేందుకు పనికొచ్చే యాంటీ-వైరల్‌ మందు ‘ఫ్యావిపిరవిర్‌’ ను గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్ తయారుచేసింది. ఐసీఎంఆర్ అనుమతితో దీన్ని త్వరలోనే మార్కెట్ లోకి విడుదలచేయనుంది. ఈ మందును ‘ఫ్యాబిఫ్లూ’ అనే బ్రాండ్‌ పేరుతో అందుబాటులోకి తేనుంది.

Covid- 19 వ్యాధి మొదటి, మధ్యస్థాయిలో ఉన్న రోగులకు ఫ్యాబి ఫ్లూ బాగా పనిచేస్తుంది. వారిలో వైరస్ లోడ్ ను బాగా తగ్గించేస్తుంది.

  • డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌ ఉంటే ఒక్కో 200ఎంజీ టాబ్లెట్‌ను రూ.103 లకు అమ్ముతారు.
  • అన్ని గోలీలు వేసుకున్నట్టే దీన్ని కూడా వేసుకోవచ్చు.
  • ఫస్ట్ డోస్ కింద.. ఒకేసారి 1800 ఎంజీ టాబ్లెట్ వాడాలి. అంటే.. 2 ఎంజీ టాబ్లెట్లు 9 వేసుకోవాలి. ఆ తర్వాత రెండు వారాల పాటు రోజుకు 800 ఎంజీ గోలీలు వేసుకోవాలి. అంటే.. రోజుకు 200 ఎంజీ టాబ్లెట్లు 4 వేసుకోవాలి.
  • తొలి రోజు టాబ్లెట్ల ఖర్చు 9*103 అంటే 927 రూపాయలు ఖర్చవుతుంది. ఆతర్వాత రోజుకు 4 టాబ్లెట్ల చొప్పున 412 రూపాయలు ఖర్చు అవుతుంది. 4 టాబ్లెట్లను 14 రోజులు వేసుకోవాలి కాబట్టి.. 5వేల 768 రూపాయల ఖర్చవుతుంది. ఈ లెక్కన 14 రోజుల్లో ఫ్యాబిఫ్లూ వాడటం వల్ల అయ్యే ఖర్చు కేవలం 6,695 మాత్రమే.
  • ఎన్ని గోలీలు ఎన్నిసార్లు వాడాలన్నది డాక్టర్లు చెబుతారు. కాబట్టి.. వైరస్ మందు ఫ్యాబిఫ్లూ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత.. ఓ ఏడువేలు ఖర్చుపెట్టుకుంటే.. వైరస్ లోడ్ ను శరీరంలో బాగా తగ్గించుకోవచ్చు. కరోనా నుంచి బయటపడొచ్చు.
(Visited 305 times, 1 visits today)
Author: kekanews