‘ఎవరికి చెప్పొద్దు’ మూవీ రివ్యూ

Spread the love

ఎవ్వరికి చెప్పొద్దు: క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న ప్రతిఒక్కరు చూడాల్సిన సినిమా !!!

నటీనటులు : రాజేష్ వర్రే, గార్గేయి యల్లాప్రగడ, వంశీ రాజ్, దుర్గ ప్రసాద్ తదితరులు
దర్శకత్వం : బ‌స‌వ శంక‌ర్‌
నిర్మాత‌ : రాకేష్ వ‌ర్రె
సంగీతం : శంక‌ర్ శ‌ర్మ‌
సినిమాటోగ్రఫర్ : విజయ్ జె ఆనంద్
రిలీజ్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు)

మంచి చిత్రాలను సపోర్ట్ చేసే దిల్ రాజు ఎవ్వరికి చెపొద్దు సినిమాను చూసి నచ్చడంతో ఈ మూవీని రిలీజ్ చేశారు.
‘బాహుబలి 2’లో సేతుపతిగా నటించిన రాకేష్ వర్రే హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎవ్వరికి చెప్పొద్దు’. బసవ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాకేష్ వర్రే సరసన గార్గేయి యల్లాప్రగడ హీరోయిన్ గా నటించింది. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

హరి (రాకేష్ వర్రే) హారతి (గార్గేయి యల్లాప్రగడ)తో ప్రేమలో పడతాడు. హారతి కూడా హరిని ప్రేమిస్తోంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల హరిని హారతి ఇష్టపడదు. ఈ క్రమంలో జరిగే కొన్ని నాటకీయ సంఘటనలు అనంతరం హరికి, హారతి ఇంకా బాగా నచ్చేస్తోంది, అలాగే హారతికి కూడా హరి అంతే నచ్చుతాడు. కానీ తన కుటుంబ పరిస్థితుల రీత్యా తాము ఇద్దరం కలవడం అసాధ్యం అని భావించిన హారతి, హరికి దూరంగా.. తన గురించి ఏ డిటైల్స్ తెలియకుండా హరిని వదిలి వెళ్ళిపోతుంది. దాంతో హరి హారతి కోసం ఏమి చేశాడు ? ఈ క్రమంలో హరి, హారతి తండ్రిని వారి కుటుంబ సభ్యులను ఎలా ఒప్పించాడు ? హరితి తండ్రికి అతని కుటుంబ సభ్యులకు క్యాస్ట్ పిచ్చి ఎలా తగ్గింది ? ఇలాంటి ఫ్యామిలీని చివరికి హరి ఎలా కన్వెంస్ చేసాడు అన్నేది కథ.

విశ్లేషణ:

సినిమాలో స్టోరీ పాయింట్ చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఇంతవరకు ఇలాంటి కథతో ఇండస్ట్రీలో సినిమా రాలేదు. ఇలాంటి కాస్ట్ కాన్సెప్ట్ సినిమాలు మరిన్ని రావాలి. అలాగే ఆ పాయింట్ నే లవ్ స్టోరీకి మెయిన్ సమస్యగా పెట్టుకుని దర్శకుడు రాసుకున్న లవ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హీరోగా నటించిన రాకేశ్‌ వర్రే పాత్రకు తగ్గట్లు లుక్స్ అండ్ నటన పరంగా కూడా ఆకట్టుకున్నాడు. ఎనర్జిటిక్ గా నటించాడు. భవిషత్తులో అతను మంచి హీరో అవుతాడు. సినిమా ఇండస్ట్రీకి మరో మంచి హీరో దొరికాడు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ తో సాగే ప్రేమ సన్నివేశాల్లో, ఆలాగే ప్రీ క్లైమాక్స్ లో మరియు కొన్ని కీలక సీన్స్ లో రాకేశ్ ఎంతో అనుభవం ఉన్న నటుడిలా బాగా నటించాడు. దర్శకుడు బసవ శంకర్ ఇలాంటి కాంట్రవర్సీ టాపిక్ ను తీసుకొని ఎవ్వరిని నొప్పించకుండా బాగా డీల్ చేశాడు.

ఇక హీరోయిన్ గా నటించిన గార్గేయి యల్లాప్రగడ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో బాగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. హీరోయిన్ కి తండ్రిగా నటించిన నటుడు, హీరో ఫ్రెండ్స్ గా నటించిన నటులు… అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సమాజంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాల్లో క్యాస్ట్ అనే అంశం ఎంత బలంగా ప్రభావితం చేస్తోంది అనే విషయాన్ని దర్శకుడు చాల చక్కగా చూపించాడు. ముఖ్యంగా హీరోయిన్ ఫాదర్ కి సంబంధించిన సన్నివేశాలు మరియు ప్రీ క్లైమాక్స్ అలాగే క్లైమాక్స్ లో హీరోయిన్ డైలాగ్స్ బాగున్నాయి.

డైరెక్టర్ బసవ శంకర్ చెప్పాలనుకున్న పాయింట్ ను చక్కగా తెరమీద చూపించాడు.
కెమెరామెన్ విజయ్ జె ఆనంద్ వైర్క్ బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ శర్మ మంచి పాటలు అందించాడు. వాటితో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కొట్టాడు. ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అంటూ ఎమోషనల్ కాంట్రవర్సీ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగా అలాగే కామెడీ సన్నివేశల పరంగా మరియు క్లైమాక్స్ అలాగే కొన్నిచోట్ల డైలాగ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ తో సినిమా ఆకట్టుకుంటుంది.

ఈ దసరా పండక్కి మీరు మీ కుటుంబంతో కలసి చూడదగ్గ సినిమా ఎవ్వరికీ చెప్పొద్దు. సో డోంట్ మిస్ ఇట్.

రేటింగ్: 3.5/5

(Visited 83 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *