ఇటలీలో ఈటల లేడు.. అందుకే బలైపోయింది..

etala italy
Spread the love

రాష్ట్రంలో కరోనా కంట్రోల్ కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలను నిజంగా ప్రశంసించాల్సిందే. చాలా రాష్ట్రాలతో పోల్చితే.. తెలంగాణ ప్రభుత్వం వేగంగా.. స్పందిస్తోంది. వారోనికో మాట మాట్లాడిన సీఎం కేసీఆర్ కన్నా.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పనితీరుపై ఎక్కువ మంది ప్రశంసలు గుప్పిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కరోనా రిస్కీ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ డెడికేషన్ తో పనిచేస్తున్నారు. వైరస్ వస్తుందేమో అని జనం భయపడిపోతున్న వేళ.. ఈటల రాజేందర్.. నేరుగా కరోనా పాజిటివ్ పేషెంట్స్ తో మాట్లాడారు. వాళ్లకు ధైర్యం చెప్పారు. చికిత్స అందిస్తున్న గాంధీ హాస్పిటల్ ఏడో ఫ్లోర్ లోని కరోనా వార్డుల్లోకి ఇటీవల నేరుగా వెళ్లారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది లాగే అంకితభావం ప్రదర్శించారు. ఇందుకు.. ఈటల రాజేందర్ తన కుటుంబసభ్యులనుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నట్టు సమాచారం.

అటు బీఆర్కే భవన్… ఇటు కోఠి కమాండ్ కంట్రోల్ సెంటర్.. ఇలా.. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ హెల్త్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగుతున్న వారే.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులుగా రిజిస్టర్ కావడంతో.. అసలు కొద్దిరోజుల పాటు ఫారిన్ నుంచి ఫ్లైట్ లనే బంద్ పెట్టించాలన్న ఆలోచన చేశారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే.. వారిని సొంత ఊళ్లోనే క్వారంటైన్ చేసి చికిత్స అందించేలా కృషిచేస్తున్నారు.

ఇదే సందర్భంలో సీఎం కేసీఆర్ మార్చి ఏడో తేదీన లైట్ గా.. మార్చి 14న సీరియస్ గా తీసుకుని మాట్లాడటం విమర్శలకు కారణమైంది. కరోనా పట్ల సీరియస్ గా పనిచేస్తూ.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పనితీరు ప్రశంసలు అందుకుంటోంది.  

కేంద్రప్రభుత్వం, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సూచనలతో.. రాష్ట్రాలన్నీ అలర్టవుతున్నాయి. ఇదే సందర్భంలో వైరస్ ను నియంత్రించడంలో.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటోంది. ఇటలీ దేశంలో కూడా ఇలా స్పందించే ఈటల లాంటి మంత్రి ఉండి ఉంటే.. ఆ దేశం పరిస్థితి మెరుగ్గా ఉండేదేమో.

(Visited 50 times, 1 visits today)
Author: kekanews