హాస్పిటల్ లో ఈటల.. కాళ్లాభిషేకం ఇష్యూ చల్లారినట్టేనా..?

Spread the love

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా వ్యవహారంతో హుజురాబాద్ బైపోల్ రాజకీయం రోజురోజుకూ మలుపులు తిరుగుతోంది. దళితబంధుపై ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది.  దళిత బంధు వచ్చింది ఈటల రాజేందర్ వల్లేనంటూ… కొందరు దళితులు ఈటల రాజేందర్ కాళ్లకు అభిషేకం చేశారు. అంతకుముందే.. అదే దళితులకు పాదాభివందనం చేశారు ఈటల రాజేందర్. ఐతే.. ఈ ఇష్యూ కొంత రాజకీయాలను హీటెక్కించింది. నమస్తే తెలంగాణ, టీఆర్ఎస్ వర్గాలు.. కాళ్లు అభిషేకం చేయించుకున్న వీడియోలను వైరల్ చేశాయి. దళితులంటే చిన్న చూపు అని ఎద్దేవా చేశాయి.

దీనిపై రాజేందర్ వివరణ కూడా ఇచ్చుకున్నాడు. ఐతే.. ఈటల కాళ్లకు బొబ్బలు రావడం.. డీ హైడ్రేషన్, న్యూమోనియా, హై షుగర్ లెవెల్స్, ఇతర సమస్యలతో ఈటల ఆరోగ్యం దెబ్బతిన్నది. దీంతో.. ఈటల తన పాదయాత్రను టెంపరరీగా ఆపేశారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.  చికిత్స తీసుకుంటున్నారు.

ఈ మొత్తం వ్యవహారంతో.. ఈటల ఆరోగ్యంపై జనంలో కన్సర్న్ పెరిగింది. ఈటల రాజీనామాతో.. 2 నెలల్లో చాలా మార్పు వచ్చింది హుజురాబాద్ లో. రోడ్లు బాగయ్యాయి. దళిత బంధు పేరుతో 10లక్షలు ఇచ్చేందుకు సర్కారు రెడీ అయింది. పెన్షన్లు వచ్చాయి. కులసంఘాలకు భూములొచ్చాయి. పాదయాత్రతో ఇంటింటికి వెళ్లి ఇపుడు హాస్పిటల్ పాలవ్వడంతో.. కొంత సింపతీ కనిపిస్తోంది.

(Visited 29 times, 1 visits today)
Author: kekanews