బిస్కెట్ల కోసం కొట్లాట.. ఇదీ మన లాక్ డౌన్ పేద భారతం

Poor People in India LockDown
Spread the love

ఇంట్లోనే ఉండండి… కరోనాను తరిమేయండి.

వినడానికి ఎంత బాగున్నా.. ఆచరించడానికి అత్యంత ముఖ్యమైనప్పటికీ… ఇది నాణానికి ఒకవైపు మాత్రమే.

ఇండియా పేద దేశం. రోజుకూలీకి పోతే వచ్చే డబ్బులతో పొట్టనింపుకునే వాళ్లు కోట్లలో ఉన్నారు. వారి ఆకలి తీర్చడం.. వారికి పని కల్పించడం ఇపుడు ప్రభుత్వం చేయాల్సిన పని. ఒకింత కష్టమైనా.. రిస్క్ తీసుకుని.. వారిని సొంతూళ్లకు చేర్చేందుకు ప్రభుత్వం రైళ్లు వేసింది. పనులు కల్పిస్తోంది.

ఐతే.. బిహార్ లోని కతిహార్ స్టేషన్ లో కనిపించిన ఓ దృశ్యం.. మన భారతదేశ పేదరికాన్ని.. అర్థాకలితో చస్తున్న వారి బతుకు చిత్రాన్ని చూపిస్తోంది.

ఎవరో పెద్దమనసు ఉన్న వ్యక్తి ఓ బిస్కెట్ ప్యాకెట్ల సంచీని పేదలకు ఇచ్చాడు.ఆ సంచిలోనుంచి బిస్కెట్లు అందుకోవడానికి పేదల మధ్య పెద్ద ఫైటింగే జరిగింది. నాకంటే నాకు.. అనుకుంటూ… అందరూ ఒకరినొకరు తోసుకున్నారు. లాక్కున్నారు. తలో ప్యాకెట్ దొరికాక.. రైలు కూత మొదలైతే గానీ.. ఫైటింగ్ ఆపలేదు.

ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాక్ డౌన్ లో పేదల ఆకలి తీర్చేందుకు ఎందరో మహానుభావులు.. తమ పెద్దమనసుతో రోజూ అన్నదానాలు చేస్తున్నారు. కానీ.. 130కోట్ల భారతావనిలో.. పేదల పొట్టలు అది ఎంతవరకు, ఎన్ని రోజులు నింపగలుగుతుందన్నదే ప్రశ్న. వీరికి పనులు దొరకాలి.. కడుపు నిండాలి.. వైరస్ త్వరగా పోవాలి.. అని కోరుకోవడం ఒక్కటే మనం చేయగలిగే పని. మిగతాదంతా…ప్రభుత్వాల చేతుల్లోనే ఉంది.

వీడియో కోసం కింద లింక్ చూడండి.

(Visited 131 times, 1 visits today)
Author: kekanews