నేను చూపించాకే.. నన్ను చూపిస్తున్నారు

Eesha Rebba About Skin Show
Spread the love

టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా ఇండస్ట్రీ పోకడ ఏంటో చెప్పింది. గ్లామర్ వరల్డ్ లో ముఖ్యంగా తెలుగులో… హీరోల కన్నా.. హీరోయిన్లకు లిమిటేషన్స్ ఎక్కువ. హీరోయిన్లు అందాలారబోయకపోయినా ఇక్కడ అవకాశాలు తక్కువే. ఇదే విషయాన్ని ఆమె ఇటీవల మీడియాకు చెప్పింది.

తెలుగు అమ్మాయి అయి ఉండి.. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఇబ్బంది పడుతున్న మాట నిజమే అని ఈషా చెప్పింది. ఐతే.. ఇందుకోసం తానే ఒక స్టెప్ తీసుకున్నట్టు చెప్పింది. గ్లామర్ గా కనిపించే ఉత్తరాది, దక్షిణాది అమ్మాయిలకు  మూవీ మేకర్స్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనీ.. అందుకే.. తెలుగు అమ్మాయి అయినా కూడా కూడా తాను గ్లామరస్ గా కనిపించాలని అనుకున్నానని చెప్పింది. అందుకే అప్పట్లో గ్లామర్ ఫొటోషూట్లు చేయించానని.. వాటితో తనను ప్రమోట్ చేసుకున్నానని చెప్పింది.

ఈ ఫొటోషూట్లు వర్కవుటయ్యాయని ఈషా రెబ్బా చెప్పింది. తాను చూపించినప్పటినుంచే.. సోషల్ మీడియాలో అందరూ తనను మరింతగా చూపించడం మొదలుపెట్టారని ఆమె చెప్పింది. రంగు తక్కువ అనే భావన తనకు ఏనాడూ లేదని.. టాలెంట్, అవకాశాలే ఇండస్ట్రీలో నిలబెడతాయని చెప్పింది ఈషా. రాగల 24 గంటల్లో మూవీ ప్రమోషన్ లో ఈషా ఇలా చెప్పింది.

(Visited 230 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *