యాద్ పియా కి ఆనె లగీ.. కిర్రెక్కిస్తున్న రీమిక్స్ సాంగ్

Yaad piya ki aane lagi Kekanews.com
Spread the love

చూడీ జో పాట… కోట్లాది మందికి ఫేవరిట్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాది పియా కి ఆనె లగీ..  1990లో అమ్మాయిలను.. కుర్రకారును ఊపు ఊపేసిన పాట ఇది. పాప్ మ్యూజిక్ వరల్డ్ లో ఈ సాంగ్ ఎప్పటికీ ఓ క్లాసిక్. ఫాల్గుని పాథక్ పాడిన ఈ పాట.. ఆమె పాడిన ఎన్నో పాటల్లో ఆల్ టైమ్ సూపర్ హిట్. కొన్నేళ్లపాటు ఈ పాట చార్ట్ బస్టర్ లిస్టును ఏలింది. అప్పటి సంగీత ప్రియులను అలరించింది. ఐతే… దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత….. ఈ పాట ఇపుడు సరికొత్తగా వినిపిస్తోంది.

యాద్ పియా కి ఆనె లగీ అంటూ అప్పట్లో వచ్చిన ఈ పాటను.. రీమిక్స్ చేశారు. ఈ పాటలో దివ్యఖోస్లా మెరిసింది.  పాప్ వరల్డ్ లో ఐకన్ గా నిలిచిపోయిన యాద్ పియాకి ఆనె లగీ పాటను.. తనదైన స్టైల్లో రీక్రియేట్ చేసింది. ఈ ట్యూన్ కూడా ఇపుడు యూట్యూబ్ సెన్సషన్ గా మారిపోయింది. పాట పోస్ట్ అయిన తొలి నాలుగు రోజుల్లేనే 40 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసింది. లక్షలు, మిలియన్లలో లైక్స్ సంపాదించింది. వేలకొద్దీ కామెంట్స్ వస్తున్నాయి.

బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన దివ్యఖోస్లా.. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. డైరెక్టర్ కూడా అనిపించుకుంది. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ను పెళ్లిచేసుకుంది. తనిష్క్ బాగ్చి రీక్రియేషన్ లో.. నేహా కక్కర్ పాడిన ఈ పాటలో… దివ్యఖోస్లా ప్రెజెన్స్ అదిరిపోయింది.

(Visited 181 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *