గొర్రెల కాపర్లు, గూండాలనే శివకోసం తీసుకున్నాం.. ‘శివ’ గురించి తేజ చెప్పిన కేక స్టోరీ

Director Teja Inspirational Speech On Shiiva Movie
Spread the love

ఏ విషయం చెప్పినా బుల్లెట్ దిగేలా చెబుతుంటారు డైరెక్టర్ తేజ. హైదరాబాద్ లో యంగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో ఏర్పాటుచేసిన ఓ ప్రోగ్రామ్ లో పాల్గొన్న తేజ… ఉత్తేజపరిచేలా ఇన్ స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చారు. ఆయన అన్న మాటలు ఆయన మాటల్లోనే…

శివ కోసం నిజమైన గూండాలనే తీసుకున్నాం

“శివ సినిమా తీసే నాటికి హైదరాబాద్ లో ఇంకా ఇండస్ట్రీ డెవలప్ కాలేదు. ఆర్టిస్టులే దొరికేవారు కాదు. నాగార్జునకు అంత పెద్ద మార్కెట్ లేదు. అప్పుడు శివ సినిమాకోసం గూండాల్లాంటి నటులు కావాలనుకున్నప్పుడు మేం నిజమైన గూండాలనే పెట్టుకున్నాం. ఇవాళ షూటింగ్ కు వచ్చి.. సాయంత్రం గొడవల్లో దూరి జైలుకెళ్లేవాళ్లు. అసిస్టెంట్ డైరెక్టర్ అయిన నేను లాయర్ ను పట్టుకెళ్లి బెయిల్ పై వాళ్లను పట్టుకొచ్చేవాన్ని. అలా 20మందిని తీసుకున్నాం. ఓసారి కెమెరా వైపు కొట్టు అంటే.. వాళ్లకు ఏమీ తెలియదు కాబట్టి.. కెమెరాకే పంచ్ ఇచ్చారు ” అని చెప్పారు తేజ.

అచ్చినం కదా.. షురూ చెయ్..

“అన్నపూర్ణ స్టూడియోలో ఉదయం 7 గంటలకు షూటింగ్ మొదలుపెట్టాలనుకున్నాం.  దీనిపై ఇంగ్లీష్ లో ఎన్నో క్లాసులు కూడా మాకు పీకారు. ఓసారి కచ్చితంగా 7 గంటలకే షూటింగ్ మొదలుపెట్టాలని నాగార్జున ఇలా అందరం వచ్చాం. కానీ.. లైట్ మెన్ రాలేదు. లైట్ బాయ్స్ గా మేం బంజారాహిల్స్ లో గొర్రెలు మేపుకునేవాళ్లనే తీసుకున్నాం. వాళ్లు రిఫ్లెక్టర్ లు తీసుకుని మెల్లగా 9 గంటలకు వచ్చారు. ఇంత లేట్ ఆ అని నేను అరిచాను. అప్పుడు వాళ్లు అచ్చినం కదా… ఇగ షురూ చెయ్ అని అన్నారు. ఈ టైమ్ కూడా ఎందుకు వేస్ట్ చేస్తావ్..ఇక మొదలుపెట్టు అన్నారు ” అని తేజ చెప్పడంతో..అందరూ ఘొల్లున నవ్వేశారు.

(Visited 119 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *