అల వైకుంఠపురములో.. డైలాగ్స్ ఇవిగో..!

Ala Vaikunthapuramulo Dialogues

త్రివిక్రమ్ మార్క్ డైలాగులు అల..వైకుంఠపురములో మూవీలో ఆకట్టుకుంటున్నాయి. డైలాగుల కోసమే రిపీట్ ఆడియన్స్ థియేటర్లకు వెళ్తున్నారు. ఆ డైలాగ్స్ ఓసారి మనమూ చూద్దాం.

1. దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది..ఒకటి నేలకు.. రెండు వాళ్లకి.. అలాంటోళ్లతో మనకు గొడవేంటి.. జస్ట్ సరెండర్ అయిపోవాలంతే..
2. గొప్ప యుద్ధాలన్నీ.. నా అనుకునే వాళ్లతోనే..(గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోసెస్ట్ పీపుల్)
3. ఎప్పుడు పిల్లలు బాగుండాలని.. అమ్మానాన్న అనుకోడమేనా.. అమ్మనాన్న బావుండాలని పిల్లలు అనుకోరా..?
3. ఇంట్లో దీపం వెలిగితే.. వెలుగు కుటుంబానికి. అదే కొండ మీద వెలిగితే.. ఊరంతటికీ వెలుగు
4. వంటోడికి.. వెయిటర్ కి నో చెప్పడం ఈజీ.. కానీ పవర్ వున్నోడికి నో చెప్పడం కష్టం. ఎంత పెద్దోడికి నో చెబితే అంత గొప్పోడివి అవుతావ్..
5.అబద్దం చెబితే ప్రేమ తెలుస్తుంది. కానీ నిజం చెబితేనే కదా..ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది. కష్టం అయినా నిజం మీద నిలబడే బంధం రాక్ సాలిడ్ గా వుంటుంది.
6.మనకు సమస్య వచ్చినప్పుడు బలం కోసం కుటుంబం వైపు చూస్తాం.. ఆ కుటుంబమే బలహీనత అయితే ఎటువైపు చూడాలి..
7.ఒక యుద్ధం వచ్చినప్పుడే.. దేశంలో ప్రజలు కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా కలిసిపోతారు.. అలాగే కష్టం వచ్చినప్పుడే కుటుంబంలో వాళ్లు, స్వార్థం ద్వేషం పక్కన పెట్టి ఒకటవుతారు.
8. భార్యాభర్తలు పెళ్లైయ్యాక తలుపు వేసుకుంటున్నారంటే.. వాళ్లు మాట్లాడుకునేది ఎవరికి తెలియకూడదని.. అదే వాళ్లు పెళ్లయ్యాక పాతికేళ్లకు కూడా తలుపులు వేసుకున్నారంటే వాళ్లు మాట్లాడుకోవడం లేదని నలుగురికి తెలియకూడదని.
9. ఆడవాళ్లు వేరే ఇంటి నుంచి వచ్చిన వాడిని భర్తగా ఒప్పుకుంటారు కానీ..తన నుండి రానివాడిని బిడ్డగా ఒప్పుకోరు.. వీడి ప్లేసులో నువ్వు వెళ్లావ్ అంటే.. నువ్వు నా బిడ్డ కిందే లెక్క..
10.కార్లు ఖాళీగా ఉన్నాయి..రోడ్లు విశాలంగా వున్నాయని వచ్చేయకురోయ్.. ఇక్కడ అన్న అని ఒకడున్నాడు.. అడ్డంగా నిలబడి పోతాడు.
11. ఇనాళ్లు పెంచిన ఆవిడను ఆంటీ అనలేను.. ఆస్తి కోసం ఆవిడ ఎవరినో అమ్మ అనలేను..
12. సంపాదించే పెళ్లాం అందిరికి ఉంటుంది..ఆపమనే పెళ్లాం ఎవరికీ వుంటుంది..
13. మనది మిడిల్ క్లాస్. లక్ష పనులు కోటి వర్రీస్ వుంటాయి.. తలవొంచుకొని వెళ్లి పోవాలంతే ..
14. మీరిప్పుడే కారు దిగారు.. నేను క్యారెక్టరెక్కా..
(Praveen Pawan FB Wall నుండి)

 

(Visited 143 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *