భళా భారత్ బయోటెక్… పంద్రాగస్ట్ కల్లా కరోనా వ్యాక్సిన్ Covaxine రెడీ!

Covaxin Vaccine For Sars cov 2
Spread the love

దేశ ప్రజలకు ఇది ఓ గుడ్ న్యూస్. కరోనా మహమ్మారి ప్రపంచదేశాలన్నీ పీడిస్తున్న ఈ టైమ్ లో.. మనదేశానికి చెందిన హైదరాబాదీ ఫార్మసీ కంపెనీ భారత్ బయోటెక్ సానుకూల వార్త అందిస్తోంది. SARS-CoV-2 వైరస్ ను నశింపచేసే వ్యాక్సిన్ తయారీలో ఆ కంపెనీ పరిశోధనలు చాలా మంచి ఫలితాలు అందిస్తోంది. ఇప్పటికే ఇంటర్నల్ గా చేసిన అనేక ప్రయోగాలు, పరిశోధనలు సక్సెస్ అయ్యాయి.

Covaxin పేరుతో కరోనా వ్యాక్సిన్ ను హైదరాబాద్ బేస్డ్ భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసింది. పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్థతో కలిసి భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ డెవలప్ చేసింది. దీనికి సంబంధించిన పరీక్షల్లో విజయవంతమైన ఫలితాలు ఇచ్చాయి. కరోనా వైరస్ తో Covaxin వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో పోరాడినట్టు పరిశోధనలు రుజువు చేశాయి.

ఈ వ్యాక్సిన్ కు ICMR కూడా టాప్ ప్రయారిటీ ఇస్తోంది. విస్తృత స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. తాజాగా ICMR సంస్థ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ.. భారత్ బయోటెక్ సంస్థకు.. దేశంలోని మెడికల్ కాలేజీల ప్రధాన పరిశోధకులకు ఓ లెటర్ రాశారు. Bharat Biotech తయారుచేసిన ఇండీజీనస్ కొవిడ్ 19 వ్యాక్సిన్ మెడికల్ ప్రొసీజర్ ను ఫాస్ట్ ట్రాక్ లో పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు.

హైదరాబాద్ లోని NIMS సహా.. దేశంలోని 12 రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్స్ కు ఐసీఎంఆర్ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. కొవాక్సిన్ పై జులై ఏడుకల్లా క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టాలని.. ఆగస్ట్ 15 లోగానే ఫలితాలు అందజేయాలని సూచించింది. అంటే.. ఈ లోపు వచ్చిన ఫలితాల ఆధారంగా.. ఆగస్ట్ 15న కేంద్రం కరోనా వ్యాక్సిన్ ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫార్మసీ రంగంలో ముందుండే ఇండియా.. అందులోనూ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ కరోనా వ్యాక్సిన్ ను కనిపెడితే.. ప్రపంచ ఫార్మా రంగంలో మన దేశానికి , నగరానికి మంచి పేరు వచ్చే చాన్సుంది. కొత్త చరిత్ర సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

(Visited 153 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *