అమ్మాయా మజాకా..! ఫోన్ కొట్టేశాడని ఉతికి ఆరేసింది

Jalandhar Girl
Spread the love

చైన్ స్నాచర్లు, మొబైల్ స్నాచర్లు ఎక్కువైపోయారు. రోడ్డుమీద వెళ్తుంటే సెక్యూరిటీ లేకుండా పోయింది. చాలామందిలో భయం కూడా కలుగుతోంది. ఐతే.. పంజాబ్ లోని జలంధర్ లో ఓ అమ్మాయి.. చాలామందికి ధైర్యం ఇచ్చింది.

బైక్ పై వచ్చిన ఇద్దరు దొంగలు ఓ అమ్మాయి ఫోన్ కొట్టేద్దామనుకున్నారు.

ఫోన్ కొట్టేసి పారిపోయేందుకు ట్రై చేశారు.

కానీ.. ఆ అమ్మాయి.. పట్టువదల్లేదు. వెంటాడింది. వాడి షర్ట్ పట్టుకుని గుంజింది. అంతే.. బైక్ ఆపక తప్పలేదు. ఆమె వాడిని వదల్లేదు.

గుంజింది.. గుంజింది.. వాడు కొడుతున్నా… వాడి షర్ట్ మాత్రం వదల్లేదు. హెల్ప్ అని అరిచింది. ఒక్కరొక్కరుగా నలుగురు వచ్చారు. బైక్ పై ఒకడు పారిపోయాడు. ఫోన్ దొంగిలించినవాడు.. ఆ ఫోన్ ను ఆమెకు ఇవ్వక తప్పలేదు.

దొంగనా కొడకల్లారా… నా ఫోన్ కొట్టేద్దామనుకున్నార్రా.. చీరేస్తా..( మనభాషలో ట్రూ ట్రాన్స్ లేషన్ అన్నమాట) అంటూ ఆ అమ్మాయి లాస్ట్ పంచ్ తో వాళ్లకు బుద్ధి చెప్పింది.  వీడియో చూడండి. మ్యాటర్ అర్థమైపోతుంది.

(Visited 170 times, 1 visits today)
Author: kekanews