బోయపాటి ఏం తీశాడయ్యా.. బాలయ్య రాజసానికి యూట్యూబ్ షేక్

Boyapati Balakrishna BB3FirstRoar
Spread the love

కొన్ని కాంబినేషన్లు.. వినగానే.. ఆకట్టుకుంటాయి. కొన్ని కాంబినేషన్లను పదే పదే వెండితెరపై చూడాలనిపిస్తుంది. కొన్ని కాంబినేషన్లు… సెట్ కాగానే.. బాక్సాఫీస్ బిజినెస్ రికార్డుల దుమ్ము దులుపుతుంది. అలాంటి కాంబినేషనే… బాలకృష్ణ – బోయపాటి శ్రీను అని చెప్పొచ్చు.

రౌద్రపాత్రల్లో బాలకృష్ణను చూడటానికి హీరోలకు అతీతంగా అభిమానులకు ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే బాలయ్య అలాంటి పవర్ ఫుల్ రోల్స్ కు పెట్టింది పేరు. సింహా, లెజెండ్ లో సరికొత్త బాలయ్యను చూపించాడు బోయపాటి శ్రీను. సమరసింహారెడ్డి లాంటి కెరీర్ బెస్ట్ సినిమా సహా.. అనేక సినిమాల్లో బి.గోపాల్ బాలయ్యను యాంగ్రీ హీరోగా చూపించి సక్సెస్ అయ్యారు. ఆ స్థాయిని మించి.. బాలకృష్ణలోని పవర్ ను బయటకు తీస్తున్నారు బోయపాటి శ్రీను.

మొదట సింహా వచ్చినప్పుడు.. వావ్ అన్నారు. ఆ తర్వాత లెజెండ్ తీసినప్పుడు.. అదుర్స్ అన్నారు. పరాజయాల్లో ఉన్నప్పుడు బాలకృష్ణకు విజయాలు అందించిన సినిమాలివి. కారణం బోయపాటి శ్రీను.

లేటెస్ట్ గా.. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో సినిమా వస్తోంది. #BB3అనేది వర్కింగ్ టైటిల్.. హ్యాష్ ట్యాగ్ గా కొనసాగుతోంది. బాలయ్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో.. లాక్ డౌన్ మోడ్ లో ఉన్న ఇండస్ట్రీని ఒక్కసారిగా అలర్ట్ చేసింది.

“ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీనుగారు మీ మాన్నగారు బాగున్నారనేదానికి.. శ్రీనుగారు మీ అమ్మ మొగుడు బాగున్నాడనేదానికి చాలా తేడా ఉందిరా..” అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ఇపుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. లక్షల్లో వ్యూస్.. వేలల్ల లైక్స్.. కామెంట్స్ తో ట్రెండింగ్ లో నంబర్ వన్ గా ఉంది #BB3FirstRoar.

రంపాలతో వచ్చే గూండాలను.. బాలయ్య తన చూపులతో ఎదుర్కొనే ఫైట్ నేపథ్యం కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. మూవీ థియేటర్లోకి వస్తే.. లాక్ డౌన్ భయాలను పోగొట్టి ఇండస్ట్రీకి మంచిరోజులు తెస్తుందో ఏమో చూడాలి.

 

(Visited 189 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *