వామ్మో… బైక్ ను శానిటైజ్ చేయకండి.. చాలా డేంజర్

Bike Sanitization
Spread the love

కరోనా టైమ్ లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. చేతులు శుభ్రంగా కడుక్కుని… వస్తువులను శానిటైజ్ చేసుకోవడం వరకు ఓకే. కానీ.. గుజరాత్ లో ఓ ప్రైవేటు కంపెనీలో రన్నింగ్ బైక్ ను శానిటైజ్ చేయడంతో… ప్రమాదం జరిగింది. దయచేసి అలా మాత్రం ఎవరూ చేయకండి.

గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో ఈ సంఘటన జరిగిది. కరోనా వైరస్ తో జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో… కంపెనీలోకి వచ్చే వాహనాలు అన్నింటినీ శానిటైజ్ చేశారు. ఓ రన్నింగ్ బైక్ ను కూడా ఆపి.. అటు ఇటూ.. సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేశారు. అంతే.. క్షణాల్లో మంటలు వచ్చాయి. సైలెన్సర్ వేడిగా ఉండటంతో.. మంటలు అంటుకున్నాయి. బైక్ రైడర్ మంటలనుంచి తప్పించుకున్నాడు. మంటలు భారీగా వచ్చాయి. కానీ.. ప్రమాదం జరగలేదు.

శానిటైజ్ దేన్ని చేయాలి.. దేన్ని చేయకూడదు అనే అవగాహన కూడా కలిగి ఉండటం చాలా ముఖ్యం. వాహనం రన్నింగ్ లో ఉండగా.. సైలెన్సర్ వేడిగా ఉంటుంది కాబట్టి.. శానిటైజేషన్ జోలికి పోకపోవడం బెటర్.

(Visited 101 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *