BBK ఎలక్ట్రానిక్స్.. Vivo, Oppo, One+, Realme అమ్మమొగుడు

BBK Electronics in India

ఇండియా మార్కెట్ పై పదేళ్లుగా అబ్జర్వేషన్

షియామీ సక్సెస్ తో మాస్టర్ ప్లాన్

లోయెస్ట్, మిడ్ రేంజ్, ప్రీమియం సెగ్మెంట్ లను కమ్మేసిన వైనం

BBK Electronics నేర్పే పాఠాలు ఎన్నో..!

ఇండియాలో 59 చైనా యాప్స్ ను కేంద్ర రద్దుచేసింది. దీంతో.. చైనా కంపెనీలు.. డిజిటల్ గా భారీ లాస్ ను ఎదుర్కొన్నాయి. నిజానికి ఒకప్పుడు వీటన్నింటికీ ఇండియా మార్కెట్ లో జీరో ఆదాయం ఉండేది. ఇపుడు 59 యాప్స్ ను రద్దుచేయడంతో..వాటి మార్కెట్ మళ్లీ మొదటికి వచ్చినట్టయింది. ఐతే.. మరి చైనా తయారుచేస్తున్న ఫోన్లను ఏం చేయాలి.. అసలు ఇండియాలో మార్కెట్ పెంచుకున్న చైనా కంపెనీలు ఎన్ని అనేది.. ఇపుడు ఆసక్తిగా మారింది.

ఇండియాలో చైనా కంపెనీల వెల్లువ

ఇండియాలో చైనా ఫోన్లు అనగానే.. షియామీ, రెడ్ మీ, వివో, ఒప్పో, రియల్ మీ, వన్ ప్లస్, ఐ క్యూ లాంటి కంపెనీల పేర్లు వినిపిస్తాయి. ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు… కొత్త మోడల్స్ ను రిలీజ్ చేస్తూ.. పండగలకు… ప్రత్యేక సేల్స్ పెడుతుంటాయి. వాటి మధ్య ఎంతో కాంపిటీషన్. సెల్ ఫోన్ షాప్ లలో .. వాటి లోగోలతో నింపేస్తుంటాయి. ఒకకంపెనీని మించి.. మరో కంపెనీ ఆఫర్లు ఇస్తూ.. మోడల్స్ రిలీజ్ చేస్తూ ప్రమోషన్ చేసుకుంటుంటాయి. కంపెనీలు చేస్తున్న ప్రచారం.. ఆఫర్ల ఆధారంగా.. ఫోన్లు కొంటుంటారు కస్టమర్లు.

Xiaomi ఇలా ఎదిగింది..

Xiaomi చైనాలో నంబర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ. 2010లోనే స్టార్టయింది.  స్మార్ట్ ఫోన్లు, మొబైల్ యాప్స్, ల్యాప్ టాప్స్, బ్యాగ్స్, ఇయర్ ఫోన్స్, షూస్, ఫిట్ నెస్ బ్యాండ్స్, ఇలాంటి చాలా ప్రొడక్టులను తయారుచేస్తోంది. Apple, Samsung, Huawei  కంపెనీలను దాటేసి.. చైనాలో నంబర్ వన్ అనిపించుకుంది. దీని సబ్ బ్రాండ్ రెడ్ మీ. చైనా తర్వాత ఈ కంపెనీకి అతిపెద్ద మార్కెట్ ఇండియానే. జపాన్, రష్యా, సౌత్ కొరియా, సౌత్ ఆఫ్రికా, సౌతీస్ట్ ఆసియా, వెస్టర్న్ యూరప్ కంట్రీస్ పైనా కన్నేసింది Xiaomi.

BBK Electronics కథ ఏంటి.. మిగతా బ్రాండ్ల సంగతేంటి..

నిజానికి… వివో, ఒప్పో, రియల్ మీ, వన్ ప్లస్, ఐక్యూ లాంటి కంపెనీలు అన్నీ ఒకే మాతృసంస్థకు సంబంధించినవి. అదే BBK Electronics. ఇది చైనాకు చెందిన అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ. సెల్ ఫోన్లు, బ్లూ రే ప్లేయర్లు, హెడ్ ఫోన్లు, హెడ్ ఫోన్ యాంప్లిఫైర్లు, స్మార్ట్ వాచ్ లు తయారుచేస్తుంటుంది. Guangdang ప్రావిన్స్ లోని Dongguan దగ్గర్లోని Changan ఇండస్ట్రియల్ సిటీలో ఈ కంపెనీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా Samsung తర్వాత అత్యత ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలు తయారుచేసేది BBK ఎలక్ట్రానిక్స్ కంపెనీనే. 2017లో దాదాపు ఆరుకోట్ల ఎలక్ట్రానిక్ పరికరాలను తయారుచేసి తన ప్రొడక్టివిటీ సత్తాను చాటుకుంది. Huawei, Appleలను దాటేసింది. Samsung రెండో అతిపెద్ద టాక్స్ పేయర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీగా అవతరించింది.

ఇండియా మార్కెట్ పై BBK Electronics కన్ను ఎలా పడింది..?

ఇండియాలో Samsung సహా.. పలు సౌత్ కొరియా, జపాన్ ఎలక్ట్రానిక్ కంపెనీల హవా నడుస్తున్నప్పుడు.. బీబీఈ ఎలక్ట్రానిక్స్ మాస్టర్ ప్లాన్ వేసింది. Xiaomi పాపులారిటీని పొందడంతో.. దాని ఫార్ములానే ఫాలో అయింది. తన సబ్ బ్రాండ్ Oppoను రంగంలోకి దించింది. Xiaomi కేవలం చీప్ అండ్ బెస్ట్ పైనే కాన్ సన్ ట్రేట్ చేసింది. ఐతే.. BBK ఎలక్ట్రానిక్స్ అలా కాదు. లోయెస్ట్, మిడ్ రేంజ్, హైరేంజ్ ప్రీమియమ్ ఇలా.. 3 సెగ్మెంట్లపైనా ఒకేసారి డిజిటల్ మాస్టర్ ప్లాన్ ను అమలు చేసింది.

ఇండియా మార్కెట్ పై BBK బిజినెస్ స్ట్రైక్

లోయెస్ట్ ఫోన్ల కేటగిరీలో.. Oppo, Vivoలతో మిడ్ రేంజ్ ఫోన్లను తీసుకొచ్చింది. అద్భుతమైన కెమెరాలంటూ ప్రచార మంత్రంవేసింది. Realme బ్రాండ్ తో.. హెడ్ ఫోన్లు, టీవీలు, లోయెస్ట్ , మిడ్ రేంజ్ ఫోన్లను తీసుకొచ్చి. ప్రచారంతో హోరెత్తిస్తోంది. One+(One Plus ) మోడల్ తో.. ప్రీమియం సెగ్మెంట్ ను క్యాచ్ చేసింది. యాపిల్ ఫోన్ మార్కెట్ కు గండికొట్టింది. ప్రీమియం ఫోన్లు అంటే ఒకప్పుడు యాపిల్, శామ్ సంగ్ చూసేవాళ్లు. వాళ్లంతా.. One Plus బ్రాండ్  వైపు మళ్లేలా చేసింది. iQoo అనే బ్రాండ్ తో.. 5జీ కేటగిరీలో అప్పుడే కాంపిటీషన్ మొదలుపెట్టింది. ఇలా.. షియామీ బ్రాండ్, సబ్ బ్రాండ్లను దాటేసి.. తనవైన మల్టీ బ్రాండ్లను సృష్టించి.. ఇండియా మార్కెట్ లో డిజిటల్ బిజినెస్ స్ట్రైక్ చేసింది BBK Electronics. ఈ అన్ని కంపెనీలకు.. దేని ఆపరేషన్స్ దానివే. దేని సేల్స్ లెక్కలు దానికే ప్రత్యేకంగా ఉంటాయి. ఐతే… వీటన్నింటికీ అమ్మొమొగుడు లాంటి మాతృసంస్థ బీబీకే ఎలక్ట్రానిక్స్ … తన కంపెనీల మధ్య తానే కాంపిటీషన్ పెట్టింది. జనం ఏదికొన్నా తమవే కొనేలా మాస్టర్ ప్లాన్ వేసింది. ఇప్పటికే ఓవరాల్ గా షియోమీ మార్కెట్ ను బీబీకే దాటేసింది.

మనకు చేతకాదా ఇది..?

ఓ చైనా కంపెనీ.. మన దేశ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను క్యాష్ చేసుకోవడం.. విస్తరించడం మన దేశ కంపెనీలకు ఓ పాఠం లాంటిందే. ఇండియాలో మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియాలను ప్రోత్సహిస్తున్న కేంద్రం.. ఈ దిశగా ప్లాన్ చేసి.. లోకల్ కంపెనీలను సాయం అందిస్తే.. ఇండియా కంపెనీలు వృద్ధి సాధించే అవకాశాలు పుష్కలం. స్వదేశీ నినాదం అప్పుడు మాటలకే కాక చేతల్లోనూ చూపించే అవకాశాలున్నాయి.

 

(Visited 1,050 times, 2 visits today)