ఆరోపించిన జంటపై కేసు పెడతాం.. బంజారాహిల్స్ పోలీసుల కౌంటర్

banjarahills police counter reaction on young couple rape allegations facebook video
Spread the love

బంజారాహిల్స్ పోలీసులు తనపై రేప్ అటెంప్ట్ చేయబోయారని ప్రవిజ, ఆమె భర్త ఫేస్ బుక్ వీడియోలో చేసిన ఆరోపణలు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యాయి. ఆ వీడియో వైరల్ కావడంతో… బంజారాహిల్స్ పోలీసులు స్పందించారు. వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ దీనిపై స్పందించి…. ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు.

Read Also : రేప్ చేయబోయారు..! బంజారాహిల్స్ పోలీసులపై యువజంట సంచలన ఆరోపణలు

ప్రవిజ, అట్లూరి సురేష్ ఇద్దరూ సోషియల్ మీడియాలో తమపై తీవ్ర ఆరోపణలు చేసి వీడియో పెట్టారని పోలీసులు అన్నారు. పోలీసుల కథనం ప్రకారం… అట్లూరి సురేష్ , వాసుదేవ్ శర్మ అనే ఇద్దరికి సివిల్ తగాదాలు ఉన్నాయి. రూ.4 లక్షల 70 వేల నగదును వాసుదేవ్ శర్మ దగ్గర సురేష్ తీసుకున్నాడు. డబ్బులు ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా సురేష్ బెదిరింపులకు దిగాడు. ఇది సివిల్ ఇష్యూ కాబట్టి కోర్టుకు వెళ్లాలని పోలీసులు సూచించారు. వాసుదేవ్ శర్మ కోర్టుకు వెళ్లి.. నోటీసు తెచ్చుకున్నాడు. కోర్టు ఆదేశాలతో అట్లూరి సురేష్ ని పోలీసులు పిలిచి మాట్లాడారు. ఆ సమయంలోనే సురేష్… ఎస్సై కాలర్ పట్టుకొని దురుసుగా ప్రవర్తించాడని పోలీసులు చెప్పారు. ఈ పరిణామాల కారణంగానే…  డిసెంబర్ 8తేదీన ఇద్దరిపై కేసు నమోదు చేశామని చెప్పారు. వీరిపై.. 353, 354, 506 కింద కేసు పెట్టామన్నారు. పోలీసులు FIR నమోదు చేశారని… కక్ష సాధింపు చర్యలుగా సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారని బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు.

“మేం వారు చేసిన ఆరోపణలపై విచారణ చేశాం. వాళ్లు చెప్పిందంతా అబద్దం అని తేలింది. గతంలో జూబ్లీహిల్స్ పీఎస్ లో కూడా వీళ్లపై కేసు ఉంది. అక్కడ కూడా ఇలాగే దురుసుగా ప్రవర్తించారు. సురేష్ .. పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తాడు..  రాజకీయ నాయకులు, పోలీస్ అధికారుల పేర్లు చెప్పుకుంటుంటారు. ఇలాంటివి మరోసారి చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం. లీగల్ ఒపీనియన్ తీసుకొని వారిపై చర్యలు తీసుకుంటాం. పోలీసులతో సురేష్ దురుసుగా ప్రవర్తించాడనేందుకు మా దగ్గర వీడియో సాక్ష్యాలున్నాయి. చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు, ఆధారాలు బయటపెట్టకపోతే వారిపై కఠినమైన యాక్షన్ ఉంటుంది” అని బంజారాహిల్స్ డీసీపీ చెప్పారు.

(Visited 99 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *