బాల్క సుమన్.. బండిని ఎంత మాటన్నావయ్యా..!

balka suman on bandi sanjay

కొన్నాళ్లుగా తెలంగాణలో వార్ వన్ సైడ్ గా కనిపిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అద్భుత ఫలితాలు రావడంతో.. ఆ పార్టీ లీడర్లు జోరుచూపిస్తూ వస్తున్నారు. ఏకంగా కేసీఆర్ నే టార్గెట్ చేస్తూ.. భారీ స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఐతే… టీఆర్ఎస్ నేతలు మాత్రం పెద్దగా నోరు విప్పిందే లేదు.

ముఖ్యంగా బండి సంజయ్ ఐతే.. ప్రతిరోజూ.. కేసీఆర్ పై విమర్శల శతఘ్నులు పేల్చుతున్నారు. చాలారోజుల తర్వాత.. టీఆర్ఎస్ నుంచి ఓ స్ట్రాంగ్ కౌంటర్ వచ్చింది. అదే ఎమ్మెల్యే బాల్క సుమన్ నుంచి.

“మహారాష్ట్రలో బాల్ థాకరేను ఎవడైనా ఏదైనా అంటే వాడుంటాడా.. తెలంగాణ సాధించిన కేసీఆర్ ను అన్నోడిని ఎందుకు వదిలిపెట్టాలి. నేనేమన్నా చేస్తే ఎమ్మెల్యేగా ఉన్న కాబట్టి… బాధ్యత లేదా అని నన్ను అంటారు. మరి మీరేం చేస్తున్నారు. కేసీఆర్ ను తిడుతున్న ఈ కుక్కలకు టీఆర్ఎస్ కార్యకర్తలుగా మీరు జవాబివ్వడం లేదెందుకు.. కేసీఆర్ మాటలు పడేటందుగా మనం తెలంగాణ తెచ్చుకున్నది. మిమ్మల్ని ఎవరు ఆపిన్రు. మీరు గట్టిగా ఆ కుక్కలకు సమాధానం చెబితే.. మిమ్మల్ని ఆపేదెవ్వరు. లెక్క కట్టి ప్రతి పిచ్చి మాటలకు సంజయ్ కు లెక్కలు అప్పజెబుతాం. బలిసిందా.. బండి సంజయ్.. బద్మాష్ సంజయ్.. నీకెన్ని గుండెలు.. తోలు తీస్తం బిడ్డా. ఓపిక పట్టుకుంటున్నాం. ప్రతిదీ భరిస్తున్నాం. బయటకు వచ్చిననాడు ఒక్కొక్కడి చెమ్డాలు ఒలుస్తం కొడుక్కాల్లారా” అని రెచ్చిపోయారు బాల్క సుమన్.

ప్రతిరోజూ సీఎంను దొంగ, లంగ, కచరా అంటూ విమర్శిస్తున్న బండి సంజయ్ కి.. గట్టిగానే వార్నింగిచ్చారు బాల్క సుమన్. ఐతే.. సుమన్ మాటలను పిచ్చ లైట్ తీసుకుంటున్నారు బీజేపీ నేతలు. మా టార్గెట్ కేసీఆర్ కానీ.. ఆయన దగ్గర పనిచేసే పిచ్చి కుక్కలు కాదంటూ.. బదులిస్తున్నారు.

 

(Visited 47 times, 1 visits today)