మామా ఒక పెగ్ లా.. అన్నంత ఈజీ కాదు బాలయ్య పాడటం

ShivaShanakari Song By Balakrishna
Spread the love

పాడటం ఓ కళ. పాడరాకపోయినా పాడటం సాహసం. ట్రోలింగ్ చేస్తారని తెలిసినా పాటపాడటం.. తెగింపు. ఆ తెగింపు నిండుగా ఉన్నోడే యువరత్న నందమూరి బాలకృష్ణ.

పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్ గా అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ.

ఎన్టీఆర్ నటించిన క్లాసిక్ సినిమా జగదీకవీరుడు సినిమాలోని.. ఎవర్ గ్రీన్ క్లాసిక్ సాంగ్ శివశంకరీ.. శివానంద లహరీ. ఈ పాటను పాడే సాహసం కూడా ఎవరూ చేయరు. మహానుభావుడు ఘంటసాల పాడిన అద్భుతమైన పాటల్లో ఇదీ ఒకటి.

ఈపాటను బాలయ్య లేటెస్ట్ గా పాడారు. అప్పుడప్పుడు అవార్డుల వేదికలపై బాలయ్య గొంతు సవరిస్తుంటారు. హీరోయిన్లతో , సింగర్లతో సరదా సరదాగా ఉత్సాహం నింపేందుకు బాలయ్య ట్రై చేస్తుంటారు. ఐతే.. రీసెంట్ గా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య ఓ ఎక్స్ పరిమెంట్ చేశారు. పైసా వసూల్ సినిమాలే.. ఈ మధ్యే.. అరె మామా ఒక పెగ్ లా అన్నారు. ఆ పాట కూడా.. మాస్ మాసాలా సాంగ్ కాబట్టి.. అలా కుదిరిపోయింది.

కానీ.. ఇది వేరు. అద్భుతమైన సాహిత్య విలువలు, గాత్ర ప్రతిభ ఉంటేనే ఈ పాట సాధ్యమవుతుంది. మన బాలయ్య దాన్ని అవలీలగా పాడేశారు. అవలీలగా పాడేస్తే.. ఏమవుతుందో అదే జరిగింది. ఎన్టీఆర్ ఒరిజినల్ సాంగ్ వీడియోకు.. తన ఆడియో జతచేసి NBK Films ట్విట్టర్ అకౌంట్ లో సాంగ్ రిలీజ్ చేశారు. యూట్యూబ్ లోనూ పోస్ట్ చేశారు. పాట ఎలా పాడామన్నది కాదు.. పాడేందుకు ట్రై చేశామా లేదా అనేదే పాయింట్ అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. జై బాలయ్యకు తోడు.. వామ్మో బాలయ్య కామెంట్స్ కూడా పడుతున్నాయి.

మీరూ ఓసారి లుక్కెయ్యండి.

(Visited 157 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *