బాలయ్యా.. ఎవరా పోరంబోకు..?

Balakrishna
Spread the love

బాలకృష్ణ సినిమాలంటేనే డైలాగులు ఓ రేంజ్ లో ఉంటాయి. ఆయన సినిమాలకు డైలాగులకోసమే వెళ్లే అభిమానులు ఉన్నారు. రియల్ లైఫ్ తడబడినా.. సినిమా డైలాగులు చెప్పడంలో బాలయ్య రూటే వేరు.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి నటసింహం నటించిన రూలర్ సినిమా రిలీజ్ కంటే ముందే.. ట్రైలర్లతో పాపులరైంది. ఓపక్క ఆంధ్రా అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో నడిచింది. ఆ టైమ్ లో అసెంబ్లీలో బాలయ్య లేడు కానీ… ఆంధ్రా అంతటా ఆయన డైలాగులే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. బాలయ్య రూరల్ మూవీలో వేసిన సెటైర్ వైరల్ అయింది.

“ఈ పొలిటికల్ పవర్ నువ్వు తీసుకున్న డిగ్రీ అనుకున్నావా.. చచ్చేవరకు నీతో ఉంటుందనుకోవడానికి.. ఎలక్షన్ ఎలక్షన్ కు పవర్ కట్టైపోతుందిరా పోరంబోకు..” ఇదీ రూలర్ మూవీలో బాలయ్య చెప్పిన కాంట్రవర్శియల్ డైలాగ్.

ఈ పోరంబోకు ఎవరు… అధికారంతో టీడీపీ పై పదే పదే మాటల దాడి చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలా.. సీఎం జగనా… అసెంబ్లీలో కాకపోయినా… ఇలా సినిమాతో బాలయ్య పంచ్ వేశాడా అని అందరూ అనుకుంటున్నారు.

ఏపీలో మద్యపాన నిషేధం దిశగా జగన్ నిర్ణయాలు అమలుచేస్తుండగా.. దానికోసమే అన్నట్లుగా ఓ డైలాగ్ చెప్పాడు యువరత్న. గ్లోబ్‌ ను గోలీలా చేసి.. పడుకున్న చోటు నుంచే ప్రపంచాన్నే చుట్టేలా చేసిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు నీకు తాగుబోతుల్లా అనిపించారా అంటూ మరో పంచ్ డైలాగ్ వేశాడు లెజెండ్.

ఇప్పుడు టీడీపీ రాజకీయ అధికారం కోల్పోయినా… మళ్లీ ఐదేళ్లకు వైసీపీకి పవర్ కట్టైపోతుందని.. టీడీపీ వస్తుందని బాలయ్య చెప్పాడంటున్నారు కొందరు అభిమానులు. బాలయ్య డైలాగులు.. అప్పట్లో లెజెండ్ లాగే.. ఇప్పుడు రూలర్ ను కూడా డిస్కషన్ లోకి తీసుకొచ్చేశాయి.

 

 

(Visited 129 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *