తీన్మార్ మల్లన్నను ఎందుకు కొట్టారు.. ఆర్మూర్ కు ఎందుకు తీసుకెళ్లలేదు?

attack on teenmar mallanna
Spread the love

క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై టీఆర్ఎస్ కార్యకర్తు దాడికి దిగారు. తన ఛానెల్ చేసిన ఓ ఆరోపణపై వివరణ ఇచ్చేందుకు ఆయిన ఇవాళ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న టైమ్ లో ఈ సంఘటన జరిగింది.

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు చేశారు తీన్మార్ మల్లన్న. యూఏఈ లో బ్యాంకుల అప్పులు కట్టకుండా ఆ దేశం వదిలి మన దేశానికి పారిపోయి వచ్చారని.. అలాంటి నాయకుడికి ఎమ్మెల్యే పదవిలో ఉండే అర్హతన లేదని మల్లన్న ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచాక భారీగా ఆస్తులు పెరిగాయని.. హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు బినామీగా జీవన్ రెడ్డి మారారని అంటున్నారు. దీనిపై ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో మల్లన్నపై కేసు ఫైల్ అయింది. దీనికి వివరణ ఇచ్చేందుకు ఆర్మూర్ వెళ్తుండగా ఈ ఎటాక్ జరిగింది.

ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు తీన్మార్ మల్లన్న వస్తున్న సంగతి ముందే తెల్సుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు… నేషనల్ హైవే 44 పై ఇందల్వాయి టోల్ ప్లాజా దగ్గర తీన్మార్ మల్లన్న ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు. కారులోంచి మల్లన్నను దిగురా అని బెదిరించారు. ఐతే.. కారు ఆపకుండా వెళ్తుండటం గమనించిన టీఆర్ఎస్ కార్యకర్తలు.. తీన్మార్ మల్లన్న కారుఅద్దాలను, కారును బలంగా గుద్దులు గుద్దారు. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.

టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయబోతున్నారని ముందే సమాచారం అందుకున్న పోలీసులు… ఇందల్వాయి టోల్ ప్లాజా కంటే కొన్ని కిలోమీటర్ల ముందునుంచే మల్లన్న కారుకు ఎస్కార్ట్ ఇచ్చారు. బందోబస్తు వ్యవహారం… దాడి చేయబోతున్నారన్న సమాచారం తెల్సుకున్న తీన్మార్ మల్లన్న తన ప్రయాణాన్ని… పోలీసుల ఎంక్వైరీని… టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని యూట్యూబ్ , ఫేస్ బుక్ లలో లైవ్ ప్రసారం చేశారు. లక్షలాది మంది ఈ దాడిని లైవ్ లో చూశారు.

ఆర్మూర్ కు ఎందుకు తీసుకెళ్లలేదంటే…?

టోల్ ప్లాజా దగ్గర దాడి చేసిన కార్యకర్తలను పోలీసులు బలవంతంగా చెదరగొట్టారు. ఆర్మూర్ వరకు మల్లన్నను తీసుకెళ్తారని ముందు అనుకున్నప్పటికీ… ఇందల్వాయి, డిచ్ పల్లి పోలీసులు ఆయనను మరో చోటకు తీసుకెళ్లారు. కేసుకు సంబంధించి వివరాలు తీసుకుని మళ్లీ పిలిపిస్తామని చెప్పి పంపించేశారు. ఈ సందర్భంలో.. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ దగ్గర మల్లన్నపై దాడికి మరోసారి టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. ఐతే.. పోలీసులు వారిని అక్కడినుంచి పంపించేశారు.

ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఓ ఎస్సైకి కరోనా పాజిటివ్ రావడంతో.. స్టేషన్ ను శానిటైజ్ చేసినట్టు సమాచారం. ఇవాళ కేసులు ఇంక్వైరీలు పక్కనపెట్టినట్టు తెలిసింది. అందుకే… తీన్మార్ మల్లన్ననను మధ్యలోనే మరో పోలీస్ స్టేషన్ లో విచారణ చేసి.. తిరిగి హైదరాబాద్ పంపించేశారు. తనపై జరిగిన దాడిపైనా మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రశ్నిస్తే దాడి చేస్తారా…గొంతు నొక్కేస్తారా… అని తీన్మార్ మల్లన్న అధికార పార్టీని ప్రశ్నించారు. తన పోరాటం కొనసాగుతుందని.. అక్రమాలపై ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటా అన్నారు నవీన్.

(Visited 459 times, 1 visits today)
Author: kekanews