వర్మ రెస్ట్ ఇన్ పీస్.. నీకో అమ్మ ఉంటే బాగుండేది : అమృత

Amritha Ramgopal varma
Spread the love

మిర్యాలగూడలో అమృత, ప్రణయ్ ప్రేమ కథ.. ఆ తర్వాత… ప్రణయ్ ను హత్య చేయిచిన మారుతీరావు.. అప్పటికే గర్భవతి అయిన.. అమృతకు కొడుకు పుట్టడం.. కొన్నేళ్ల తర్వాత.. మారుతీరావు సూసైడ్ చేసుకోవడం.. ఇలా.. ఎన్నో మలుపులు తిరిగిన అమృత స్టోరీని రామ్ గోపాల్ వర్మ సినిమాగా తీయాలని నిర్ణయించారు. ఈ ఫొటో ఫాదర్స్ డే నాడు సంచలనం సృష్టించింది. ఐతే.. అమృత దీనిపై సీరియస్ గా రియాక్టైంది. చాలా పెద్ద లెటర్ తో రామ్ గోపాల్ వర్మకు బదులిచ్చింది. ఆమె ఏం చెప్పిందో చదివితే.. ఆమె అనుభవిస్తున్న సంఘర్షణ అర్థం అవుతుంది.

“నేను ఈ రోజు మధ్యాహ్నం నిద్రపోతున్న టైమ్ లో నా అత్తమ్మ , మామయ్య (ప్రణయ్ తల్లిదండ్రులు) ఓ ఫొటోను, సోషల్ మీడియాలో పోస్టును చూపించినప్పుడు షాకయ్యాను. అందులో నేను, చనిపోయిన నా భర్త ప్రణయ్, చనిపోయిన నా తండ్రి మారుతి రావు ఉన్నారు. కాంట్రవర్సియల్ మూవీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వారితో ఓ సినిమా తీయబోతున్నానని ప్రకటించడంతో మా ఫ్యామిలీ చాలా ఒత్తిడికి లోనవుతోంది.

మన జీవితంలో కొత్త సమస్యను ఎలా ఎదుర్కోబోతున్నామో అని నా అత్తమ్మ మరియు మామయ్య ఇద్దరూ టెన్షన్ పడుతున్నారు. వారు నన్ను వెంటనే నిద్రనుంచి లేపి… పోస్ట్ చూపించేముందు.. నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలని కోరారు.

నేను పోస్ట్ చూసినప్పుడు సూసైడ్ చేసుకోవాలనిపించింది. నా ప్రపంచం మొత్తం మళ్లీ తలక్రిందులైంది. నా గుండె.. పెయిన్ ను తీసుకోలేకపోయింది. నా భర్త ప్రణయ్ హత్య జరిగిన రోజు నుంచి.. నేను ఎంతో సంఘర్షణ అనుభవిస్తూ ఆత్మగౌరవంతో బతుకీడుస్తున్నా. నేను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనే నా నిర్ణయాన్ని, నా జీవితాన్ని, నా క్యారెక్టర్ ను ముక్కలు చేసిన ఈ సమాజానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవంతో నా జీవితాన్ని గడపడానికి చాలా కష్టపడుతున్నా.

నాకు చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు తప్ప నా కథ ఎవరికీ తెలియదు.

నా తండ్రి తన కులం ,  అతను సంపాదించిన సంపద గురించి అహంకారంతో తప్పుడు జీవితాన్ని గడిపాడు. కాంట్రాక్ట్ కిల్లర్స్ చేత నా తండ్రి.. నా భర్తను చంపడానికి ఇదే కారణం. , నేను గర్భవతిగా ఉన్నప్పుడు పట్టపగలే నా భర్తను నా కళ్ళ ముందే నిర్దాక్షిణ్యంగా చంపాడు.

నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. గర్భవతిగా ఉన్నప్పుడూ… పోస్ట్ డెలివరీతో మీడియాను ఫేస్ చేశాను. కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాను. తప్పుడు ప్రచారాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తూ, ప్రణయ్ క్యారెక్టర్, నా క్యారెక్టర్ పై జరిగిన ఫాల్స్ ప్రొపగాండాను.. ప్రింట్ ,  ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తిప్పికొట్టాను.

నేను భారమైన మనసుతో ప్రతిరోజూ, ప్రతి రాత్రి వెళ్లదీస్తున్నా. నా కొడుకు.. గోడపై ఉన్న తన తండ్రి ప్రణయ్ ఫొటో వంక తదేకంగా చూస్తున్నప్పుడు ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నాను. అతను తన వైపు ఎందుకు చూస్తున్నాడో నాకు తెలుసు. నిజ జీవితంలో తన తండ్రిని ఎప్పుడూ నా కొడుకు చూడలేదు. ఈ వ్యక్తి ఎప్పుడూ నా దగ్గరకు ఎందుకు రాలేదు అనే ఆలోచనలో ఉన్నాడేమో?  మనం జీవిస్తున్న సోషల్ స్ట్రక్చర్ ను.. అతని తండ్రిని చంపిన విషయాన్ని అతడికి అర్థమయ్యేలా చెప్పడం నాకు పెద్దసవాలుగా మారిందిప్పుడు.

ఇప్పటికే పబ్లిక్ గా మారిన మా కుటుంబవ్యవహారంతో ఇబ్బంది పడుతున్నా. మా ఫొటోలు బహిరంగంగా వాడిన రామ్ గోపాల్ వర్మతో ఇప్పుడు నేను కొత్త సవాల్ ఫేస్ చేయాల్సి వస్తోంది.  రేపు రేపు వర్మ నా కొడుకు ఫొటోలు వాడినా నేను ఆశ్చర్యపోను.

నా జీవితం , కులం, పక్షపాతంతో జీవిస్తున్న సామాన్య ప్రజలు.. కేవలం నాగరికత ,  చదువురానివారని అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైమ్ పట్టింది. జీవితంలోని వివిధ సమస్యలు, సమాజం పట్ల థాట్ ప్రాసెస్ పై ఉపన్యాసాలు ఇచ్చే రామ్ గోపాల్ వర్మ..  ట్విట్టర్‌లో మా ఫొటోలను మా అనుమతి లేకుండా ఉపయోగించాలా వద్దా అని తెల్సుకునేందుకు ఒక్క నిమిషం ఆలోచించలేకపోయారు..

నా ఇన్ బాక్స్ కు అనేక మెసేజ్ లు వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ లో వర్మ పోస్టులు ట్యాగ్ చేస్తున్నారు. నా భర్త హత్య జరిగినప్పటి నుండి నేను ఆన్ లైన్ అబ్యూస్ కు గురయ్యాను. నన్ను మరో పెళ్లిచేసుకోమని.. నా లైంగిక జీవితం ఎలా జరుగుతోందని.. నాకు ఎఫైర్ ఉందా లేదా అని .. నన్ను చనిపోవాలని.. ఇలా.. ఎందరో ఎన్నో ప్రశ్నలతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు.

ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కారణంగా.. నేను సినిమా నిర్మాతలతో ఏదైనా ఎఫైర్ కలిగి ఉన్నానేమో అనే ఫాల్స్ ప్రొపగాండా ఎదుర్కోవాల్సి వస్తుంది. సమాజంలో నా లాంటి యంగ్ విడో అనుభవించే బాధ రామ్ గోపాల్ వర్మకు తెలుస్తుందని భావిస్తున్నాను.

తండ్రి లేని నా కొడును చూసుకోవటానికి చాలా బాధ్యతతో నేను సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాను. పేరెంటింగ్ అనేది ఒక వ్యక్తిని, అతని ఆలోచన ప్రక్రియను, నిర్ణయాలను నిర్మించే చాలా ముఖ్యమైన అంశం. నేను ఎదిగిన ఈ సమాజంలోనే నా బిడ్డ కూడా ఎదగాలి.

సాయంత్రం 5 గంటలకు నా జీవిత కథ ఆధారంగా ఒక సినిమా పోస్టర్‌ ను విడుదల చేస్తున్నానని రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చూసిన తర్వాత ప్రతి నిమిషం వణికిపోయాను. నా పిల్లల జీవితాన్ని కాపాడటానికి నేను ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్న టైమ్ లో.. రామ్ గోపాల్ వర్మ పోస్ట్ నన్ను మరోసారి మొత్తం సమాజ దృష్టిలో పడేసింది.

భర్త మరణంతో రోజూ ఒత్తిడితో కూడిన మానసిక జీవితాన్ని అనుభవిస్తున్న ఒంటరి తల్లి పట్ల మీరు ఎటువంటి ఆందోళన లేకుండా ఉన్నారు. ఇప్పటికే చాలా పబ్లిసిటీ పొందారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

మీరు విడుదల చేసిన పోస్టర్ నేను చూశాను. అది నా జీవితానికి సంబంధించినది కాదు. ఇది మా పేర్లను ఉపయోగించడం ద్వారా మీరు అమ్ముకుంటున్న నకిలీ కథ. మీలాంటి జాతీయ స్థాయి ఫిలిం మేకర్.. రెండు నిమిషాల పాపులారిటీ కోసం .. నాలాంటి అభాగ్యుల పేర్లను ఉపయోగిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు.

నేను నా కథను నా కొడుక్కు చెప్పేరోజు మీరు రిలీజ్ చేసిన ఫొటో కూడా ఓ భాగం అవుతుంది.

మిస్టర్ రామ్ గోపాల్ వర్మ… ఒక స్త్రీని గౌరవించటానికి మీకు విలువలు నేర్పించే తల్లి లేనందుకు నేను జాలిపడుతున్నాను.

మీపై కేసు పెట్టి నేను మీకు ఎలాంటి ప్రచారం ఇవ్వను. మీరు ఈ స్వార్థపూరిత,  మానిప్యులేటివ్, క్రూయల్ సొసైటీలో ఫేక్ మూవీ ప్రొడ్యూసర్ పేరిట ఉన్న ఓ భాగం మాత్రమే. నేను బాధ రూపంలో మీ కంటే ఎక్కువ జీవితాన్ని జీవితాన్ని చూశాను. రెస్ట్ ఇన్ పీస్ వర్మ.” అని సుదీర్ఘంగా లెటర్ రాసింది అమృత.

(Visited 258 times, 1 visits today)
Author: kekanews