అలీ మామూలోడు కాదు.. పవన్ కల్యాణ్ కు భారీ పంచ్

Spread the love

పవన్ కల్యాణ్, అలీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అది ఒకప్పుడు.  పవన్ ఉన్న సినిమాల్లో అలీ ఉండాల్సిందే. అలీకి సినిమాల్లేకపోయినా.. పవన్ కల్యాణ్ తన సినిమాలతో బూస్ట్ ఇచ్చాడు. పవన్ హిట్లతో… పవన్ ఇచ్చిన సపోర్ట్ తో.. తన టాలెంట్ కలుపుకుని..  అలీ ఎప్పుడూ అభిమానులను అలరిస్తూ వచ్చాడు. ఐతే.. రాజకీయాల్లో పవన్ యాక్టివ్ అయ్యాక క్యారమ్స్ మారిపోయాయి.

2019 అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో… అలీ వైసీపీలో చేరి ఆ పార్టీకి ప్రచారం చేశాడు. జనసేనకు మద్దతివ్వలేదు. దీంతో.. తనకు అలీ ద్రోహం చేశాడని పవన్ కల్యాణ్ విమర్శలు చేయడం.. అలీ తిప్పికొట్టడం జరిగాయి. ఇపుడు పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ అనే సినిమాతో వస్తున్నాడు. ఇదే టైమ్ లో.. వకీల్ సాబ్ అవతారం ఎత్తాడు అలీ. మా గంగానది పేరుతో ఓ సినిమాలో నటించాడు.

అమ్మాయిలతో ఆడుకునే మగాళ్లకు శిక్షలు వేసే కథ ఇది. ఆడవారి పక్షాన నిలబడి కేసులు వాదించే క్రిమినల్ లాయర్ గా అలీ కనిపిస్తున్నాడు. పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ లోనూ.. ఇంతే. ఓ ఇంటెన్స్ ఉన్న కథతో వకీల్ సాబ్ తెరకెక్కింది. క్రిమినల్ లాయర్ గా.. కీలకమైన కేసును వాదించి.. మహిళలను రక్షించే లాయర్ గా పవన్ కల్యాణ్ నటించాడు. ఇపుడు ఇదే కథతో.. అలీ నటించాడు. పవన్ కు కౌంటర్ గానే అలీ ఈ మూవీని టకా టకా తీయించి.. రిలీజ్ చేశాడని చెబుతున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

(Visited 168 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *