బైరాన్ పల్లి నరమేధానికి72 ఏళ్ళు.. రక్తం మరిగిపోయే గతం

#నేను చాలాసార్లు #బైరాన్ పల్లికి పోయిన. మొన్న 25 నాడుకూడా పోయి వచ్చిన.. .. ఆనాటి నిజాం #వ్యతిరేక_పోరాటయోధులు ఇంకా కొద్దిమంది బతికేఉన్నరు. ఈసారి వాళ్లలో ఇద్దరిని కలిసిన.. ఒకరు #ఇమ్మడి_ఆగమ్_రెడ్డి.. ఇంకొకరు #చల్లా_చంద్రారెడ్డి.. …. అప్పుడు జరిగిన అత్యాచారాలను, హత్యాకాండను,దోపిడిలను ఇప్పటికీ కళ్లకు కట్టినట్టు చెప్తారు.. .. #బైరాన్‌పల్లి_నరమేధం #జరిగి_నేటికి 72 #సంవత్సరాలు. .. నిజాం పాలనలో సైనికులు, రజాకార్లు,నిజాం పోలీసులు చేసిన అరాచకాలకు అంతే లేదు.ఎదురు తిరిగిన […]

#నేను చాలాసార్లు #బైరాన్ పల్లికి పోయిన.
మొన్న 25 నాడుకూడా పోయి వచ్చిన..
..
ఆనాటి నిజాం #వ్యతిరేక_పోరాటయోధులు ఇంకా కొద్దిమంది బతికేఉన్నరు.
ఈసారి వాళ్లలో ఇద్దరిని కలిసిన..
ఒకరు #ఇమ్మడి_ఆగమ్_రెడ్డి..
ఇంకొకరు #చల్లా_చంద్రారెడ్డి..
….
అప్పుడు జరిగిన అత్యాచారాలను,
హత్యాకాండను,దోపిడిలను ఇప్పటికీ కళ్లకు కట్టినట్టు చెప్తారు..
..
#బైరాన్‌పల్లి_నరమేధం
#జరిగి_నేటికి 72 #సంవత్సరాలు.
..
నిజాం పాలనలో సైనికులు,
రజాకార్లు,నిజాం పోలీసులు చేసిన అరాచకాలకు అంతే లేదు.ఎదురు తిరిగిన వారిని కిరాతకంగా నరికి,కాల్చిచంపి,మహిళలను మానభంగాలు చేసిన ఘటనలెన్నో .
నిజాం పాలనలో ఏ గ్రామాన్ని కదిలించినా కన్నీటిగాధలే..
..
సరిగ్గా ఇదేరోజు అంటే 1948 ఆగస్టు 27న బైరాన్‌పల్లిలో నరమేధం జరిగింది..
అంతకుముందు మూడుసార్లు ఆ గ్రామంలో అరాచకం చేయడానికి వచ్చిన రజాకార్లను తరిమికొట్టారు గ్రామస్తులు..
నాలుగోసారి నిజాం సైన్యం, పోలీసులు,రజాకార్లు అంతా కలిసి సూమారు ఆరు వందలమంది కలిసి
గ్రామంపై పంజా విసిరారు…
..
గ్రామస్థులు ఎదురు తిరిగారు..
తిప్పి కొట్టడానికి శాయశక్తులా ప్రయత్నించారు..అందులో చాలామంది వీరమరణం పొందారు..మిగిలిన వారిని పట్టుకొని కట్టేసి,
కాల్చి చంపారు..
అనంతరం ఇండ్లలోకి జొరబడి
యవ్వనంలో ఉన్న మహిళలను వెతికి తెచ్చి
కొరడాలతో కొట్టి,
నగ్నంగా చేసి,బతుకమ్మ ఆడించారు..
..
భర్త,తమ్ముళ్లు,అన్నలు,తండ్రుల శవాల మధ్య
రోదిస్తూ విధిలేక బరిబాతల బతుకమ్మ ఆడాల్సి వచ్చింది…
ఆ తరువాత ఊరంతా చూస్తుండగా
బహిరంగంగా 63 మంది మహిళలపై
నిజాం మూకలు
అత్యాచారాలు చేసారు…
..
ఈ ఒక్కరోజే మొత్తం 96 మంది హత్యకు గురయ్యారు.
63 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు..
ఆ తర్వాత
అవమానాలు భరించలేక కొద్దిమంది మహిళలు
ఆత్మహత్యలు చేసుకున్నారు..
కొన్ని కుటుంబాలు ఊరు విడిచి వెళ్లిపోయాయి.
భారత చరిత్రలో మరో జలియన్‌వాలాబాగ్ ఇది..
..
ఊరి పొలిమేరలో అమరవీరుల స్థూపం నిర్మించారు..
‌‌ గ్రామం నడిబొడ్డున పెద్ద బురుజు ఇప్పటికీ ఉంది..
ఏనాటికీ బైరాన్‌పల్లి పోరాట చరిత్ర మరువరానిది.. అనేకసార్లు నిజాం సైన్యాన్ని, రజాకార్లమూకలను తరిమికొట్టిన గ్రామం.
వీరోచిత పోరాటాలకు కేంద్రం..
..
కానీ..,
చరిత్ర పుటల్లో స్థానం దొరకని రక్తాక్షరమే బైరాన్‌పల్లి గ్రామస్థుల వీరపోరాటం..
..
ఆనాటి అమరవీరులకు
పాదాభివందనాలు.. 🙏🙏🙏
….
#నిజాం_రాజు_గొప్పోడు..
నిజాం రాజు మంచోడు అనే #వెధవలకు
ఈ పోస్ట్ #అంకితం..

(Visited 26 times, 1 visits today)

Next Post

5000సార్లు రేప్.. ఆ ఒక్కమ్మాయికే జరిగిందా..? చదవాల్సిన పోస్టు

Fri Aug 28 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="http://www.kekanews.com/72-years-completed-to-bairanlally-incident/"></div>5,000 సార్లు రేప్ జరిగిందా… ??? 139 మంది రేప్ చేశారా…??? 9 సంవత్సరాల నుండి ఇంతటి దారుణం జరుగుతుంటే అమ్మాయి ఏం చేసింది ??? అప్పుడే ఖండించి ఉంటే లేదా పోలీసులకు ఆశ్రయించి ఉంటే ఇంత జరిగేదా…??? సరిత పై జరిగిన అత్యాచారం విషయంలో చాలామంది అనుకుంటున్న మాటలు.. కాని వాస్తవానికి… ఇంత జరగడం కాదు దీనికంటే ధారుణం జరిగి ఉంటుంది కాని అమ్మాయి బయట చెప్పలేకపోతుంది. ఇది […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="http://www.kekanews.com/72-years-completed-to-bairanlally-incident/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->
139 members Rape on a Woman 5000times

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..