సూర్యగ్రహణం వస్తోంది.. ఏ రాశుల వాళ్లు అలర్ట్ గా ఉండాలంటే..?

Solar Eclipse June 2020
Spread the love

2020 ఏడాదిలో తొలి సూర్యగ్రహణం రేపు జరగబోతోంది. ఆదివారం అమావాస్య నాడు సూర్యగ్రహణం వస్తోంది. ఈ సోలార్ ఎక్లిప్స్ ను.. రింగ్ ఆఫ్ పైర్ గా పిలుస్తున్నారు. ఆదివారం పొద్దున 10.12 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 47నిమిషాల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు పరిపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేయనుంది.

లాస్టియర్ డిసెంబరులో సూర్య గ్రహణం వచ్చింది. మళ్లీ తర్వాత ఇప్పుడే వస్తోంది. అంతరిక్షంలో జరిగే ఈ అరుదైన ఖగోళ సంఘటన మూలంగా కొన్ని కీలక మార్పులు జరగనున్నాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం రాశిచక్రంపై ఈ గ్రహణం ప్రభావం ఉంటుందన్నారు. కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను కనిపిస్తుండగా.. .. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు.

సింహ రాశి, కన్యా రాశి, మీన రాశి వాళ్లు సేఫ్ గా ఉన్నట్టే. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణంతో వారికి ఎటువంటి అశుభాలు సూచించటం లేదు. మిగతా రాశులవాళ్లు కొద్దిరోజుల పాటు అలర్ట్ గా ఉండాలి. వారి వ్యక్తిగత ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. వారికుటుంబసభ్యుల ఆరోగ్యం పట్ల అప్రమత్తతతో మెలగాలి. వృథా ఖర్చులు తగ్గించుకోవాలి. అనవసర ప్రయాణాలు పెట్టుకోకూడదు. ఎటువంటి వివాదాల్లోకి తలదూర్చొద్దు. ఈ సూచనలు పాటిస్తే.. మిగతా రాశులవారికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష పండితులు చెబుతున్నారు.

(Visited 195 times, 1 visits today)
Author: kekanews