ప్రకాశ్ రాజ్… KGF2.. ఈ స్టిల్ చెప్పే సంగతులెన్నో…

Prakash raj kgf2

కరోనా వచ్చినా.. కాలం ఆగదు. అది సాగిపోతూనే ఉంటుంది.

కష్టాలు వచ్చినా.. కలకాలం ఉండవు. పరిస్థితులను బట్టి ముందుకుపోవాల్సిందే.

కరోనా లాక్ డౌన్ తర్వాత… సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

ఇండియాలో ఇపుడు మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో #KGF-Chapter2 ఒకటి. కేజీఫ్ ఫస్ట్ పార్ట్ సంచలనం విజయం సాధించడంతో… కేజీఎఫ్ 2 సినిమాను మరింత పక్కాగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గానే  మొదలై కొనసుగుతోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న సినిమా కేజీఎఫ్ 2. ఈ స్థాయిలో భారీగా నిర్మిస్తున్న ఏ మూవీ షూటింగ్ కూడా.. కరోనా లాక్ డౌన్ తర్వాత ఇంకా మొదలుకాలేదు. ఇండియాలో లాక్ డౌన్ తర్వాత.. షూటింగ్ మొదలైన ప్యాన్ ఇండియా స్థాయి సినిమాగా కేజీఎఫ్ 2హిస్టరీలోకి ఎక్కింది.

ప్రఖ్యాత నటుడు ప్రకాశ్ రాజ్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఆయనపై సీరియస్, ఇంపార్టెంట్ సీన్స్ తీస్తున్నారు. కేజీఎఫ్ లో కొత్త ముఖాలు కనిపించి ఆకట్టుకున్నా.. ఈసారి ప్యాన్ ఇండియా స్థాయిలో మూవీ ఉండాలని ఫ్యాన్స్ కోరుకోవడంతో.. పలు భాషల్లో ప్రముఖులను మూవీలో భాగస్వాములను చేస్తున్నారు.  అలా.. ప్రకాశ్ రాజ్ సహా.. ఈసారి కేజీఎఫ్ 2 టీంలో జాయిన్ అయ్యారు.

మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

(Visited 39 times, 1 visits today)